ETV Bharat / bharat

ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్​లో హింస- రైలుకు నిప్పు- నలుగురు సజీవదహనం - బంగ్లాదేశ్ ఎన్నికలు

Benapole Express Fire : ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్​లో రైలు ప్రమాదం కలకలం సృష్టించింది. ప్యాసింజర్ రైలుకు దుండగులు నిప్పంటించడంవల్ల ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

Benapole Express Fire
Benapole Express Fire
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 12:17 PM IST

Updated : Jan 6, 2024, 12:54 PM IST

Benapole Express Fire : బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికలకు ముందు రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పుపెట్టడం వల్ల నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అనేక మందికి కాలిన గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం (జనవరి 7న) దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం రాజకీయంగా తీవ్ర దూమారం రేపింది.

  • Visuals from Dhaka, Bangladesh after four people lost their lives after a passenger train coming from Benapole, a port city bordering India, was set on fire near the capital's Kamalapur Railway Station.

    Local officials said that most of the train's nearly 292 passengers were… pic.twitter.com/Ya4j6hacUp

    — Press Trust of India (@PTI_News) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | CID team of Bangladesh, along with a forensic team, gathers evidence and carries out an investigation on the train that was set ablaze on January 5. pic.twitter.com/IBG3Ovr3CA

    — ANI (@ANI) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్‌కు సరిహద్దున ఉన్న బెనాపోల్‌ పట్టణం బెనాపోల్ నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌ రైలు కమలాపుర్‌ రైల్వేస్టేషన్‌కు రాత్రి 9గంటల ప్రాంతంలో చేరుకోగానే దుండగులు దాడి చేశారు. నాలుగు బోగీలకు నిప్పుపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. అయితే ఘటన జరిగిన సమయంలో రైలులో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారని, వారంతా ఎన్నికల కోసం భారత్​ నుంచి స్వస్థలాకు తిరిగి వెళ్తున్నవారేనని అధికారులు తెలిపారు.

Benapole Express Fire
రైలు బోగీల్లో మంటల వల్ల వస్తున్న పొగ
Benapole Express Fire
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

షేక్ హసీనా దిగ్భ్రాంతి
ఈ రైలు ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్​ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్‌పీ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా కుట్రపూరిత చర్యేనని, దీనిపై ఐరాస పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది. గత డిసెంబరులోనూ బంగ్లాదేశ్‌లో రైలుకు దుండగులు నిప్పు పెట్టారు.

కారణం అదేనా?
Bangladesh Election 2024 : ఎలక్షన్​ జరిగే వరకు ఏ పార్టీకీ సంబంధం లేని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఖలిదాజియా సారథ్యంలోని 'బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ' (బీఎన్‌పీ) డిమాండ్‌ చేసింది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలని ప్రతిపాదించింది. దీన్ని షేక్‌ హసీనా ఆధ్వర్యంలోని అధికార అవామీలీగ్‌ తోసిపుచ్చింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ వరసగా నాలుగోసారి విజయం సాధించడం లాంఛనమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైలు ప్రమాదం జరగడం గమనార్హం.

Bangladesh Election 2024
పోలింగ్​ కోసం సిద్ధం సామాగ్రి

120 మంది పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నికలు
బంగ్లాదేశ్‌లో జనవరి 7న పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 120 మంది విదేశీ పరిశీలకుల పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీరు ఇప్పటికే ఢాకా చేరుకున్నారు. వీరిలో భారత ఎన్నికల కమిషన్‌ నుంచి ముగ్గురు ప్రతినిధులు కూడా ఉన్నారు.

Bangladesh Election 2024
పోలింగ్ అధికారులకు సామాగ్రి అందజేస్తున్న భద్రతా సిబ్బంది

Bangladesh Train Accident Today : ప్యాసింజర్ ట్రైన్, గూడ్స్​ రైలు ఢీ..​ 20 మంది మృతి

దేశ రాజధానిలో భారీ పేలుడు.. 17 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు..

Last Updated : Jan 6, 2024, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.