ETV Bharat / bharat

BEL Jobs 2023 : బెల్​లో ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్​.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

BEL Jobs 2023 : ఇంజినీరింగ్​ అభ్యర్థులకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​ పలు విభాగాల్లో ఇంజినీర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. సీనియర్ ఇంజినీర్​, డిప్యూటీ మేనేజర్స్​, ట్రైనీ ఇంజినీర్​, ప్రోజెక్ట్ ఇంజినీర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..

BEL JOBS 2023
bharat electronics limited engineers recruitment
author img

By

Published : Jun 26, 2023, 10:15 AM IST

Updated : Jun 26, 2023, 10:57 AM IST

BEL Jobs 2023 : భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ (బెల్) పలు విభాగాల్లో ఇంజినీర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. సీనియర్​ ఇంజినీర్​, ప్రోజెక్ట్​ ఇంజినీర్​, ట్రైనీ ఇంజినీర్​ పోస్టుల కోసం విడివిడిగా నోటిఫికేషన్స్​ విడుదల చేసింది.

బెల్​ సీనియర్​ ఇంజినీర్​ జాబ్స్​
BEL Senior Engineer Recruitment : నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ 'బెల్​' 24 సీనియర్​ ఇంజినీర్​, డిప్యూటీ మేనేజర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు

  • డిప్యూటీ మేనేజర్​ - 05
  • సీనియర్​ అసిస్టెంట్​ ఇంజినీర్​ - 19

విద్యార్హతలు
Senior Engineer Jobs Education Qualification : ఎలక్ట్రానిక్స్​/ ఎలక్ట్రికల్​/ మెకానికల్​/కంప్యూటర్​ సైన్స్​ ఇంజినీరింగ్​లో బీఈ/ బీటెక్​ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు ఆయా పోస్టులకు అనుగుణంగా పూర్వ అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి
Senior Engineer Jobs Age Limit : 2023 మే 01 నాటికి డిప్యూటీ మేనేజర్​ పోస్టులకు 36 ఏళ్ల గరిష్ఠ పరిమితి; సీనియర్​ ఇంజినీర్​ పోస్టులకు 32 ఏళ్ల గరిష్ఠ పరిమితి విధించారు.

ఎంపిక విధానం
Senior Engineer selection process : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీనియర్​ ఇంజినీర్​ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ
ఆసక్తి గల అభ్యర్థులు 2023 జులై 4లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా "మేనేజర్​ (హెచ్​ఆర్​), ప్రోడక్ట్​ డెవలప్​మెంట్​ & ఇన్నోవేషన్​ సెంటర్​ (పీడీఐసీ), భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​, ప్రొఫెసర్​ యూఆర్​ రావ్​ రోడ్​, నియర్ నాగాలాండ్ సర్కిల్​, జలహల్లి పోస్ట్, బెంగళూరు - 560013, ఇండియా " చిరునామాకు తమ దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.

బెల్​ ట్రైనీ అండ్​ ప్రోజెక్ట్​ ఇంజినీర్​ జాబ్స్​
BEL Trainee engineer and Project Engineer Recruitment : భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్ 82​ ట్రైనీ ఇంజినీర్​, ప్రోజెక్ట్ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్​ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు

  • ట్రైనీ ఇంజినీర్​ (జాబ్​ కోడ్​ - టీఈ0101) - 43
  • ప్రోజెక్ట్​ ఇంజినీర్​ (జాబ్​ కోడ్​ - పీఈ0101) - 38
  • ప్రోజెక్ట్​ ఇంజినీర్​ (జాబ్​ కోడ్​ -పీఈ0102) - 01

మొత్తంగా 82 పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు
Trainee and Project Engineer Education Qualification : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి నాలుగేళ్ల వ్యవధి గల ఎలక్ట్రానిక్స్​/ మెకానికల్​/ కంప్యూటర్​ సైన్స్​/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​ బ్రాంచ్​ల్లో బీఈ/బీటెక్​/ బీఎస్స్ (ఇంజినీరింగ్​) చేసి ఉండాలి. దీనితోపాటు ఆయా పోస్టులకు అనుగుణంగా పూర్వ అనుభవం ఉండాలి.

వయోపరిమితి
Trainee/Project Engineer Age Limit : ట్రైనీ ఇంజినీర్​ పోస్టులకు 2023 మే 01 నాటికి 28 ఏళ్ల గరిష్ఠ పరిమితి; ప్రోజెక్ట్​ మేనేజర్​ ఉద్యోగాలకు 32 ఏళ్ల గరిష్ఠ పరిమితి ఉంది.

ఎంపిక విధానం
Trainee/Project Engineer Selection Process : అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో వచ్చిన మెరిట్​ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : 2023 జూన్​ 28. ఆసక్తి గల అభ్యర్థులు "మేనేజర్​ (హెచ్​ఆర్​), ప్రోడక్ట్​ డెవలప్​మెంట్​ & ఇన్నోవేషన్​ సెంటర్​ (పీడీఐసీ), భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​, ప్రొఫెసర్​ యూఆర్​ రావ్​ రోడ్​, నియర్ నాగాలాండ్ సర్కిల్​, జలహల్లి పోస్ట్, బెంగళూరు - 560013, ఇండియా " చిరునామాకు తమ దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.

Last Updated : Jun 26, 2023, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.