ETV Bharat / bharat

Beggars Leave Snakes in Train : డబ్బులివ్వలేదని రైల్లో పాములు వదిలిన బిచ్చగాళ్లు.. అరగంట పాటు అందరూ హడల్ - చంబల్ ఎక్స్​ప్రెస్​ రైళ్లో పాములు

Beggars Leave Snakes in Train : ఉత్తర్​ప్రదేశ్​ మీదుగా వెళుతున్న ఓ రైల్లో పాములు వదిలారు కొందరు యాచకులు. పాములు ఆడిస్తే డబ్బులివ్వలేదనే కారణంతో ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో అరగంటకు పైగా భయంతో వణికిపోయారు ప్రయాణికులు.

beggars-leave-snakes-in-train-in-chambal-express-uttarpradesh-for-not-giving-money
బిచ్చ వేయంలేదని రైళ్లో పాములు వదిలిన బిచ్చగాళ్లు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 7:45 AM IST

Beggars Leave Snakes in Train : ప్రయాణికులు బిచ్చం వేయలేదని రైల్లో పాములు వదిలారు కొందరు యాచకులు. పాములను ఆడించినా ప్రయాణికులు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇలా చేశారు. దీంతో రైల్లో ఉన్నవారంతా భయంతో వణికిపోయి పరుగులు తీశారు. హావ్‌డా నుంచి గ్వాలియర్‌ వెళ్తున్న చంబల్‌ ఎక్స్‌ప్రెస్​ శనివారం ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్న సమయంలో జరిగింది ఈ ఘటన.

యాచకులు చేసిన పనికి ప్రాణభయంతో కొందరు బెర్తులపైకి ఎక్కారు. మరికొందరు మరుగుదొడ్లలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. దాదాపు 30 నిమిషాలకు పైగా రైల్లో భయానక వాతావరణం నెలకొంది. యూపీలోని మహోబా జిల్లా మలక్‌పుర గ్రామం వద్ద.. పాములున్న బుట్టలతో నలుగురు వ్యక్తులు రైలెక్కారని ప్రయాణికులు తెలిపారు. అనంతరం పాములను బయటకు తీసి ఆడించి.. ప్రయాణికుల నుంచి డబ్బులు డిమాండ్​ చేశారు. కాగా కొందరు ప్రయాణికులు వారికి డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అంటూ గొడవకు దిగారు. దీంతో బుట్టల్లోని పాములను బోగీలో వదిలిపెట్టారు యాచకులు.

ఘటనపై కొందరు ప్రయాణికులు మహోబా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన యాచకులు.. పాములను తిరిగి బంధించి, స్టేషను రాకముందే రైలు దిగి పరారయ్యారు. పోలీసు తనిఖీల అనంతరం రైలు తిరిగి గ్వాలియర్‌కు బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన గురించి ప్రయాణికులతో మాట్లాడామని పోలీసులు తెలిపారు. ప్రయాణికులెవ్వరికీ హాని జరగలేదని వారు వెల్లడించారు. రైల్లో అలజడికి కారణమైన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

మహిళ పర్సు చోరీ.. దొంగను కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు..
Thief Hanging From Train Viral Video : రైలు ప్రయాణికురాలి పర్సును కిటికీ గుండా చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు చుక్కలు చూపించారు తోటి ప్యాసెంజర్లు. దొంగతనం చేస్తుండగా పట్టుకుని.. కొన్ని కిలోమీటర్లు కిటికీకే అతడ్ని వేలాడదీశారు. రైలు తర్వాత స్టేషన్​కు చేరుకున్నాక.. దొంగను ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​కు అప్పగించారు. బిహార్​లోని బెగూసరాయ్​లో కటిహార్​ నుంచి సమస్తిపుర్​ వెళ్తున్న రైలులో కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.

రైల్లో వెళ్తున్న 'ఆమె'పై డౌట్.. చెక్ చేస్తే బ్యాగులో పాములు, బల్లులు, సాలీళ్లు

Iron Poles On Train Track : రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర.. ట్రాక్​పై ఇనుప స్తంభాలు పెట్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.