మహారాష్ట్రలోని సోలాపుర్‌లో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. పొగతాగటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందా? అనే అంశంపై బాంబే హైకోర్టులో నమోదైన పిటిషన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.


పొగ తాగటం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోందా లేదా అంశంపై బాంబే హైకోర్టులో విచారణ జరుగుతోంది. సిగరెట్ వల్ల వైరస్ వ్యాప్తి అధికమౌతుందా లేదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు గతంలో ప్రశ్నించింది. ఒకవేళ రిస్క్ ఉందని తేలితే సిగరెట్ ఉత్పత్తులను తాత్కాలికంగా బ్యాన్ చేయాలని ప్రభుత్వాలకు సూచించింది. ఈ నేపథ్యంలో సిగరెట్ ఉత్పత్తులకు కరోనాకు సంబంధం లేదని పలు కంపెనీలు ప్రభుత్వానికి విన్నవించాయి.
ఇవీ చదవండి: