ETV Bharat / bharat

రైల్వే శాఖ గుడ్​న్యూస్- ఆ ప్రయాణికులకు బెడ్​ కిట్​- ఐటమ్స్​ లిస్ట్​ ఇదే - బెడ్​ రోల్​ కిట్స్ తాజా వార్తలు

Bed Roll Kit For RAC Passengers In AC Trains : ఆర్​ఏసీ టికెట్ ప్యాసింజర్స్​కు గుడ్​న్యూస్​. కేటాయించిన బెర్తుపై సేదతీరేందుకు ఇకనుంచి వారికి కూడా స్పెషల్​ బెడ్​ రోల్​ కిట్​ను ఇవ్వనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఆయా జోనల్​ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.

Railways Announces Complete Bed Roll Kit For RAC Passengers In AC Compartments
Bed Roll Kit For RAC Passengers In AC Trains
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 5:05 PM IST

Updated : Dec 21, 2023, 5:30 PM IST

Bed Roll Kit For RAC Passengers In AC Trains : రైల్వే ఏసీ కంపార్ట్​మెంట్లలో ప్రయాణించే ఆర్​ఏసీ ప్యాసింజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్​ రైల్వే. ఇక నుంచి ఆర్​ఏసీ టికెట్​ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్​ రోల్​ కిట్​ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్​ చెప్పారు. ఈ కిట్​లో ఒక బెడ్​షీట్​, దుప్పటి, టవల్​తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఈ నిర్ణయం ఏసీ ఛైర్​ కార్​ ప్రయాణికులకు వర్తించదని ఆయన చెప్పారు.

ఈ బెడ్​ రోల్​ కిట్​కు సంబంధించిన ఛార్జీలను ఆర్​ఏసీ ప్రయాణికులు బుక్​ చేసుకునే టికెట్​ రుసుములోనే చెల్లిస్తున్నారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలతో కూడిన ఓ లేఖను ఇప్పటికే అన్నీ జోన్​ల జనరల్​ మేనేజర్లకు పంపినట్లు శైలేంద్ర సింగ్​ తెలిపారు. ప్రతి ఆర్​ఏసీ( Reservation Against Cancellation ) ప్రయాణికుడికి ఈ సదుపాయం అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన అన్నారు.

"ఈ బెడ్​ రోల్​ కిట్​ సదుపాయం ఏసీ క్లాస్​లలో(ఏసీ ఛైర్​ కార్​ మినహా) ప్రయాణించే ప్యాసింజర్లకు ఇబ్బంది కలగకుండా, వారిని కూడా ఇతర ప్రయాణికుల(కన్ఫర్మ్​డ్​ ప్యాసెంజర్స్​)తో సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము. వీటి ధరను కూడా నామమాత్రంగానే టికెట్​ రుసుములోనే వసూలు చేస్తున్నాము. ఇది వారికి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది."
- శైలేంద్ర సింగ్​, రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఆర్​ఏసీ టికెట్​ అంటే ఏంటి?
ఆర్​ఏసీ- రిజర్వేషన్​ ఎగైనిస్ట్​ క్యాన్సలేషన్. అంటే ఒకే ట్రైన్​ బెర్త్​ను ఇద్దరు ప్రయాణికులకు విక్రయిస్తుంది రైల్వే శాఖ. అంటే ఒకే బెర్తును ఇద్దరు పంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రిజర్వేషన్​ పద్ధతిలో ముందే S1 బెర్తును కన్ఫామ్​ చేసుకున్నాడు. ఇప్పుడు అదే నంబర్​ బెర్త్​ను ఇంకో వ్యక్తి ఆర్​ఏసీ కింద ఒకే రోజు(ఇద్దరి ప్రయాణం ఒకేసారి)కు కొనుగోలు చేశాడనుకుందాం. అయితే ముందుగా రిజర్వేషన్​ చేసుకున్న ప్యాసింజర్​ పలు కారణాలతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ బెర్తు పూర్తిగా ఆర్​ఏసీ ప్యాసింజర్​కు లభిస్తుంది. అలా జరగని పక్షంలో ఆ సీటు లేదా బెర్తును ఇద్దరు షేర్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇద్దరిలో రిజర్వేషన్​ ప్యాసింజర్​కు ఎలాగో కేటాయించిన బెర్తుపైనే రోలింగ్​ బెడ్​ కిట్​ మాదిరి సెటప్​ ఉంటుంది. రెండో వ్యక్తైన ఆర్​ఏసీ ప్యాసింజర్​కు ఉండదు. అందుకని అలాంటి వారు(ఆర్​ఏసీ ప్రయాణికుడు) కూడా ఇబ్బంది పడకూడదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు.

తమిళనాడు విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలుశిక్ష- ఆ కేసులోనే!

'పార్లమెంటులో ఉపరాష్ట్రపతి కులతత్వాన్ని రగిల్చారు'- విపక్షాల నిరసనలో ఖర్గే

Last Updated : Dec 21, 2023, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.