ETV Bharat / bharat

కూతురికి స్కూటీ కొనిచ్చాడని.. భర్తను చంపేసిన రెండో భార్య - కర్ణాటక క్రైం వార్తలు

భర్తను ఇనుపరాడ్డుతో కొట్టి చంపి పోలీసులకు లొంగిపోయింది ఓ మహిళ. ఈ ఘటన కర్ణాటకలోని నేలమంగళలో జరిగింది. మొదటి భార్య కుమార్తెకు స్కూటీ కొనివ్వడం వల్లే నిందితురాలు హత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

wife kills business man
రియల్​ ఎస్టేట్​ వ్యాపారిని రాడ్డుతో కొట్టి చంపిన బ్యూటీషియన్
author img

By

Published : Nov 9, 2021, 8:07 PM IST

భర్తను.. రెండో భార్య దారుణంగా హత్య చేసిన ఘటన ఘటన కర్ణాటకలోని నేలమంగళలో సోమవారం జరిగింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అదే ప్రాంతానికి చెందిన రియల్​ఎస్టేట్​ వ్యాపారి పలర్​ స్వామి అలియాస్ స్వామి రాజ్​ (50)గా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం..

పలార్​ స్వామికి 25 ఏళ్ల క్రితం సత్యకుమారి అనే మహిళతో వివాహమైంది. ఆరేళ్ల క్రితం ఓ బ్యూటిపార్లర్​లో పనిచేసే నేత్రను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హరోక్యథనహల్లి అనే ప్రాంతంలో పలార్​ స్వామి నేత్రతో నివాసముంటున్నాడు.

రెండో వివాహం తర్వాత కూడా పలార్​ స్వామి తన మొదటి భార్య, పిల్లలు కలుస్తుండేవాడు. వారికి ఆర్థికంగా అండగా నిలిచేవాడు. ఇటీవల పలార్​ స్వామి తన మొదటి భార్య కుమార్తెకి స్కూటీ కొనిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నేత్ర.. భర్తను రాడ్డుతో కొట్టి చంపింది. అనంతరం.. పోలీసులకు లొంగిపోయింది. పలార్ స్వామి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. అందుకే అతడిని చంపేశానని వెల్లడించింది.

ఇదీ చూడండి : 'ఆ చట్టాలను రద్దు చేయకపోతే..' కేంద్రానికి టికాయిత్​ అల్టిమేటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.