ETV Bharat / bharat

బూడిద గుమ్మడికాయలతో అద్భుత కళాఖండాలు - గుమ్మడికాయలు

అడవిలో కాసే బూడిద గుమ్మడికాయలతో.. తాబేలు, పిల్లి, హంసలు లాంటి బొమ్మలు తయారు చేస్తున్నాడు హిమాన్శు శేఖర్​ పాండియా అనే కళాకారుడు. అంతేకాకుండా రంగురంగుల పూలు, కళ్లు చెదిరే గృహాలంకరణ వస్తువులూ తయారుచేస్తున్నాడు.

Beautiful handicrafts with dried pumpkins
బూడిద గుమ్మడితో కళాఖండాలు
author img

By

Published : Feb 28, 2021, 11:04 AM IST

బూడిద గుమ్మడికాయలతో కళాఖండాలు

తాబేలు, పిల్లి, హంసలు, చెట్లు, టేబుల్ ల్యాంప్‌.. రంగురంగుల పూలు, కళ్లు చెదిరే గృహాలంకరణ వస్తువులు ఇలాంటి ఎన్నో అందమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులకు జీవం పోస్తున్నాడాయన. అదీ అడవిలో కాసే బూడిద గుమ్మడికాయలతో. దక్షిణ ఒడిశాలోని ఆదివాసీ గ్రామాల్లో పాత్రలుగా వాడే ఎండిన గుమ్మడికాయలతోనే అందమైన హ్యాండిక్రాఫ్ట్స్ రూపొందిస్తున్నాడు హిమాన్శు శేఖర్ పాండియా. అడవుల్లో విరివిగా కాసే బూడిద గుమ్మడి కాయలను తినేందుకు పెద్దగా వినియోగించరు.

ఒకప్పుడు ఈ గుమ్మడి కాయల లోపలి గుజ్జు తీసి, వాటిని ఎండబెట్టి, నీటిని మోసేందుకు వినియోగించేవారు ఆదివాసీలు. పురుగులు చొరబడని ఈ డొప్పల్లో విత్తనాలు దాచిపెట్టేవారు. కొందరు సంగీత వాద్యాలు తయారు చేస్తారు. క్రమంగా వీటి వినియోగమూ తగ్గుతోంది. ఈ పాత్రలు కనుమరుగయ్యాయనే చెప్పొచ్చు. రాయగడకు చెందిన ఓ కళాకారుడు హిమాన్షు శేఖర్‌ పాండియా వివి‍‍ధ డిజైన్లు, ఆకృతులతో గుమ్మడికాయ డొప్పలకు కొత్త రూపం తీసుకొస్తున్నాడు. ఈ పని ద్వారా మంచి ఆదాయం గడిస్తూనే..ఔత్సాహిక యువతకు నేర్పిస్తూ, ఉపాధి మార్గం చూపుతున్నాడు.

"అసలు ఇలా బూడిద గుమ్మడికాయల నుంచి భారత్‌లో క్రాఫ్ట్‌లు తయారవుతున్నాయన్న విషయం ప్రభుత్వానికి తెలీనే తెలీదు. ఈ కాయలు వివిధ ఆకారాలు, పరిమాణాల్లో కాస్తాయి. పైగా చాలా తక్కువకే దొరుకుతాయి. అందుకే ఇంత తక్కువకు, విరివిగా దొరికే బూడిద గుమ్మడి కాయలతో మంచి ఆదాయం పొందేందుకు ఆసక్తి కనబరుస్తాను. కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టినా, ఎక్కువ లాభాలే ఆర్జిస్తున్నాను."

-హిమాన్షు శేఖర్ పాండియా, కళాకారుడు

"ఆదివాసీ గ్రామాల ప్రజలు నీటిని మోసుకెళ్లేందుకు గుమ్మడికాయల నుంచి తయారుచేసిన పాత్రలనే వినియోగిస్తున్నారు. ఎక్కువశాతం ఈ కాయల్ని వినియోగించకుండా పారేస్తారు. వాటినే మేం ఇంటికి తీసుకొచ్చి, శుభ్రం చేసి, రంగురంగుల కళాఖండాలు రూపొందిస్తున్నాం."

-చాందిని సరకా, కళాకారిణి

బూడిద గుమ్మడికాయలు విరివిగా దొరుకుతాయి. దక్షిణ ఒడిశాలోని మల్‌కంగిరి, కోరాపుట్, నాబరంగ్‌పూర్, రాయగడ లాంటి మన్యం ప్రాంతాల్లో అయితే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. వీటిని సేకరించిన తర్వాత..శుభ్రంగా కడిగి, శాండ్‌ పేపర్‌తో రుద్ది, నున్నగా తయారు చేస్తారు. వాటిపై రంగురంగుల డిజైన్లతో అందమైన ఆకృతులు రూపొందిస్తారు. కొన్నేళ్లపాటు ఈ కళాఖండాలు చెక్కుచెదరకుండా అంతే అందంగా కనిపిస్తాయి. అందుకే రోజురోజుకీ వీటికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. హిమాన్షు ఆన్‌లైన్ వేదికగా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. దేశవ్యాప్తంగా జరిగే ప్రదర్శనల్లో తన డిజైన్లను ప్రదర్శనకు ఉంచుతున్నాడు. అడవిలో దొరికే బూడిద గుమ్మడికాయలు హిమాన్షుకి ఓ వినూత్న ఆదాయ మార్గంగా మారాయి.

"గుమ్మడికాయలు సేకరించిన తర్వాత, నీటిలో నానబెడతాం. పైన పొట్టు తీసేసి, శుభ్రంగా కడిగి, ఎండలో ఆరబెడతాం. తర్వాత శాండ్‌ పేపర్‌తో నున్నగా రుద్ది, హిమాన్షు సర్‌కి ఇస్తాం. వాటిపై సర్ బొమ్మలు గీస్తారు. కావల్సిన ఆకృతి వచ్చేలా కత్తిరిస్తారు. ఆ తర్వాత రంగులతో పెయింట్ వేస్తారు."

-సుమిత్రా పాతంగి, కళాకారిణి

"భారతీయ రైతులు బూడిద గుమ్మడికాయలు పండిస్తారు. కానీ జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఎన్నో మార్పులకు లోనైంది ఈ కాయల సాగు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ ఉత్పత్తుల తయారీలో నిమగ్నైన కళాకారులు..గతేడాది ప్రభుత్వం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలా వారికి ప్రోత్సాహమందుతోంది. ప్రస్తుతమైతే ఈ ఉత్పత్తుల నుంచి మంచి ఆదాయమే వస్తోంది."

-హిమాన్షు శేఖర్ పాండియా, కళాకారుడు

ఈ లావూ తుంబా క్రాఫ్ట్‌లు..గృహాలంకరణ వస్తువులుగా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తే..ఈ ఉత్పత్తుల తయారీ ఆదివాసీల జీవనాన్ని మెరుగుపరిచే ఓ వ్యాపార మార్గంగా మారుతుంది.

ఇదీ చూడండి: సాంకేతికతే ఆలంబనగా.. సదావకాశాలతో సాగిపోగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.