ఉత్తర్‌ప్రదేశ్‌లోని తాజ్‌మహల్ వద్ద సందడి చేశారు అందాల భామలు. తాజ్ వద్దకు చేరుకున్న.. దాదాపు 35 దేశాలకు చెందిన సుందరీమణులు.. గంటపాటు అక్కడే కలియ తిరిగారు. ఫ్యాషన్ ప్రదర్శనలు, ఆటపాటలతో సందర్శకులను అలరించారు. విశ్వసుందరి పోటీల్లో పాల్గొనేందుకు ఆగ్రా వచ్చిన ఈ భామలు.. తాజ్‌మహాల్ అందాలను ఆస్వాదించారు. తాజ్ మహల్‌ను సందర్శించిన భామలు.. దాని చరిత్ర, పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం విశేషాలను తెలుసుకున్నారు.
అనంతరం తాజ్‌మహల్ ముందు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన పర్యాటకులంతా.. ఈ సుందరీమణులను ఆసక్తిగా తిలకించారు. మరోవైపు తాజ్‌మహాల్ పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సెల్ఫీలు దిగేందుకు పర్యటకులు ఆసక్తి కనబర్చారు.
ఇవీ చదవండి: ప్రభుత్వ గ్యాస్ సంస్థలకు కేంద్రం రూ.22వేల కోట్ల సాయం.. వారికి దీపావళి బోనస్
రూ.2కోట్ల నగదు, కేజీ బంగారం చోరీ... 300 గ్రాములు వెనక్కి ఇచ్చి ఔదార్యం!