వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో వ్యాక్సిన్ల కోసం ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్రం మాత్రం ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ కోసం తాపత్రయపడుతోందని ఎద్దేవా చేశారు.
"మోదీ ప్రభుత్వం ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ కోసం తాపత్రయపడుతోంది. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ కావాలనుకుంటే వారు సొంతంగా వ్యాక్సిన్ సంపాదించుకోవాలి(అత్మనిర్భర్ కావాలి)."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మోదీ సర్కారు ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయని అన్నారు రాహుల్.
శనివారం.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు పలువురి ప్రముఖుల ఖాతాలకు బ్లూ బ్యాడ్జీని తొలగించింది కేంద్రం. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొద్ది గంటలనంతరం వాటిని పునరుద్ధరించింది ట్విట్టర్.