ETV Bharat / bharat

తండ్రులే కాదు.. కుమారులు కూడా ముఖ్యమంత్రులే

తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని కుమారులు రాజకీయాల్లోకి రావడం సహజమే. అయితే, వారి దారిలోనే పయనించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం కొంచెం కష్టమైన విషయం. కానీ ఇలాంటి వారు దేశ చరిత్రలో చాలా మందే ఉన్నారు.

father son duo chief minister, రాష్ట్రాల మఖ్యమంత్రులు
తండ్రులే కాదు.. కొడుకులు కూడా ముఖ్యమంత్రులే..
author img

By

Published : Jul 28, 2021, 8:37 AM IST

Updated : Jul 28, 2021, 8:30 PM IST

ప్రస్తుత రాజకీయాల్లో వారసత్వం అనేది షరా మామూలైంది. తండ్రి ప్రజాప్రతినిధి అయితే కుమారుడు, లేదా కుటుంబంలో మరెవరైనా అదే బాటలో పయనిస్తున్నారు. అయితే సర్పంచ్​ కొడుకు సర్పంచ్​ అవడం తేలిక. కొంచెం కష్టపడితే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే.. మంత్రి కొడుకు మంత్రి మంత్రి అవ్వొచ్చు. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అవ్వడం అనేది చాలా కష్టం. అలా అవ్వాలంటే వారికి ఎంతో అదృష్టం ఉండాలి.

అలాంటి ఘటనే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి విషయంలో జరిగింది. కర్ణాటక కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న బసవరాజ్​ బొమ్మై తండ్రి సోమప్ప రామప్ప బొమ్మై కూడా గతంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1988 నుంచి 1989 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు.

అయితే ఇలాంటి వారే కర్ణాటకలో మరొకరు ఉన్నారు. వారే జేడీయూ అధినేత హెచ్​డీ దేవెగౌడ తనయుడు హెచ్​డీ కుమారస్వామి. యడియూరప్ప కంటే ముందుగా కుమారస్వామి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇలాంటి ఘటనలు కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదు. మన దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులకు వారి కుమారులు రాజకీయ వారసులుగా కూడా సేవలందించారు. ఇప్పటికీ అందిస్తున్నారు. అలాంటి వారు ఎవరో ఓ సారి చూద్దాం.

  • తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ ప్రస్తుతం ఆ రాష్ట్రానికి సీఎంగా సేవలందిస్తున్నారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన డా. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి కుమారుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్​కు ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు.
  • ఆంధ్రప్రదేశ్​కు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో ప్రస్తుతం సీఎంగా ఉన్న నవీన్​ పట్నాయక్​ తండ్రి బిజూ పట్నాయక్​ గతంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
  • అరుణాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పెమా ఖండూ తండ్రి దూర్జీ ఖండూ గతంలో సీఎంగా వ్యవహరించారు.
  • ఝార్ఖండ్​ సీఎంగా ఉన్న సేవలందిస్తున్న హేమంత్​ సోరెన్​.. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్​ కుమారుడే.
  • ఇదిలా ఉండే జమ్ముకశ్మీర్​లో అబ్దుల్లా కుటుంబం నుంచి మూడు తరాల వారు సీఎంగా పని చేశారు. వారే షేక్​ అబ్దుల్లా.. ఆయన కుమారుడు ఫరూఖ్​ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్​ అబ్దుల్లాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ములాయం సింగ్​ కుమారుడు అఖిలేష్​ యాదవ్​, విజయ్​ బహుగుణ కుమారుడు హేమావతి నందన్​ బహుగుణాలు ముఖ్యమంత్రులుగా పని చేశారు.
  • హరియాణా నుంచి దేవీలాల్​ కుమారుడు ఓం ప్రకాశ్​ చౌతాలా, మహారాష్ట్ర నుంచి శంకర్​రావ్​ చౌహాన్​ కొడుకు అశోక్​ చౌహాన్​లు సీఎంలుగా పని చేశారు.
  • తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వారిలో కూతుర్లు కూడా ఉన్నారు. కశ్మీర్​ ముఖ్యమంత్రిగా సేవలందించిన ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్​ కూతురు మెహబూబా ముఫ్తీ సీఎంగా పనిచేశారు.
  • ముఖ్యమంత్రి కుమారులు ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బిహార్​ సీఎంగా పనిచేసిన లాలూ ప్రసాద్​ యాదవ్​ కుమారుడు తేజస్వీ యాదవ్​ ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. అలానే పంజాబ్​కు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశ్​ సింగ్​ బాదల్​ కుమారుడు సుఖ్​భీర్​ సింగ్​ బాదల్​ కూడా ఉపముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

ఇవీ చూడండి:

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్​ బొమ్మై

తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణం

Last Updated : Jul 28, 2021, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.