ETV Bharat / bharat

యడ్డీ వారసుడిగా బొమ్మై- లింగాయత్​కే కన్నడ సీఎం పీఠం - undefined

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్​ బొమ్మై నియామకమయ్యారు. ఈ మేరకు భాజపా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. బొమ్మై.. ప్రస్తుతం కర్ణాటక హోంమంత్రిగా ఉన్నారు.

Basavaraj Bommai
బసవరాజ్​ బొమ్మై
author img

By

Published : Jul 27, 2021, 8:50 PM IST

Updated : Jul 27, 2021, 10:41 PM IST

కర్ణాటక కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప స్థానంలో ఆయన వారసుడిగా బసవరాజ్‌ బొమ్మై ఎంపికయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మైని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. కర్ణాటక ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ సామాజిక వర్గానికే మళ్లీ సీఎం పీఠాన్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. బసవరాజ్‌ బొమ్మై ఎంపికపై కమలం పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కొత్త సీఎంను ఎంపిక చేశారు.

Karnataka new CM
బసవరాజ్​ బొమ్మై

ప్రస్తుతం హోంమంత్రిగా కొనసాగుతున్న బొమ్మై.. మాజీ సీఎం ఎస్‌.ఆర్‌. బొమ్మై కుమారుడు. యడియూరప్పకు కూడా అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.

'సీఎం పదవీ పెద్ద బాధ్యత'

నూతన సీఎంగా ఎన్నికైన తర్వాత మీడియాతో మాట్లాడారు బొమ్మై. "ముఖ్యమంత్రి పదవి ఓ పెద్ద బాధ్యత. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తాను. ఇది ప్రజల అనుకూల, పేదల అనుకూల ప్రజలపాలన అవుతుంది," అని బసవరాజ్​ వ్యాఖ్యానించారు. అలాగే కరోనా నియంత్రణకు కృషి చేస్తామని.. రాష్ట్రంలో వరద బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

రేపు ప్రమాణస్వీకారం!

సమావేశానికి భాజపా అధిష్ఠానం పరిశీలకులుగా నియమించిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌ రెడ్డితో పాటు రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జి అరుణ్‌ సింగ్‌, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న యడియూరప్ప హాజరయ్యారు. బొమ్మై ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌కు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

భాజపా పార్టీ నేతలందరూ కలిసి బసవరాజ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యడియూరప్ప పేర్కొన్నారు. "ప్రధాని ఆధ్వర్యంలో ఆయన (బొమ్మై) కష్టపడి పనిచేస్తారు. మద్దతుగా ఉన్నందకు ప్రధానికి కృతజ్ఞతలు" అని యడియూరప్ప పేర్కొన్నారు.

Karnataka new CM
కేంద్ర మంత్రులతో పాటు బొమ్మై
Karnataka new CM
సమావేశానికి హాజరైన యడియూరప్ప

"బొమ్మై ఎన్నిక ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. సొంత పార్టీల్లోనే కాకుండా.. అన్ని పార్టీల నేతలు ఆయన్ను గౌరవిస్తారు" అని కర్ణాటక భాజపా నేత కే సుధాకర్​ పేర్కొన్నారు.

Karnataka new CM
కర్ణాటక శాసనసభా పక్ష నేతలు

బొమ్మై వైపే అధిష్ఠానం మొగ్గు

మరోవైపు, కొత్త సీఎం రేసులో రాష్ట్ర గనుల శాఖమంత్రి మురుగేశ్‌ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాట్‌, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, డిప్యూటీ సీఎం అశ్వథ్‌ నారాయణ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ సునీల్‌ కుమార్‌ తదితర కీలక నేతల పేర్లు కూడా ప్రధానంగా వినబడినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బొమ్మై వైపే భాజపా అధిష్ఠానం మొగ్గుచూపింది.

Karnataka new CM
సమావేశానికి హాజరైన ముఖ్య నేతలు

యడియూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న మధ్యాహ్నం ప్రకటించినప్పట్నుంచి ఆయన వారసుడు ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. యడ్డీ తన రాజీనామా లేఖను గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌కు పంపగా.. ఆయన ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లింగాయత్‌ వర్గంలో బలమైన నేతగా ఉన్న యడియూరప్ప స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని, పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని కూడా ఇప్పటికే ప్రకటించారు.

ఇదీ చూడండి: పెగాసస్​పై నయా రాజకీయం- కాంగ్రెస్​ దూరం!

Last Updated : Jul 27, 2021, 10:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.