ETV Bharat / bharat

రెండు రోజుల సమ్మెకు బ్యాంకు సంఘాల పిలుపు - బ్యాంకు యూనియన్​ల రెండు రోజుల సమ్మె

మార్చి 15,16 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్ బ్యాంక్​ యూనియన్స్(యూఎఫ్​బీయూ) వెల్లడించింది.

Bank Unions Decided to stike On march 15,16Bank Unions Decided to stike On march 15,16
రెండు రోజుల సమ్మెకు బ్యాంకుయూనియన్స్​ పిలుపు
author img

By

Published : Feb 9, 2021, 5:09 PM IST

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు రోజుల సమ్మెకు బ్యాంకు సంఘాలు పిలుపునిచ్చాయి. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె జరపాలని యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్​బీయూ) ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్​ పరం​ చేస్తామని కేంద్ర ​ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు.

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాం. పెట్టుబడుల ఉపసంహరణల్లో ప్రభుత్వ దూకుడు స్వభావం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలపై చర్చించాము. ఐడీబీఐతో సహా రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకణ, ఎల్​ఐసీలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ఇన్సురెన్స్​ రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్యనం వంటి అంశాలపై సమావేశంలో మాట్లాడాం. ప్రభుత్వ తిరోగమన చర్యలను వ్యతిరేకించాలని నిర్ణయించాం.

సీ.హెచ్​. వెంకటాచలం, ఆల్​ ఇండియా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్​ జనరల్​ సెక్రటరీ

ఇదీ చదవండి:సాగు చట్టాల రద్దుకు లోక్​సభలో కాంగ్రెస్ బిల్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.