ETV Bharat / bharat

తల్లిదండ్రుల అప్పు తీర్చాలని బాలుడికి బ్యాంక్​ నోటీసులు - అప్పు తీర్చాలని బాలుడికి బ్యాంక్​ నోటీసులు

తల్లిదండ్రులు చేసిన అప్పును తీర్చాలని బాలుడికి ఓ బ్యాంక్​ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసిన బ్యాంక్​ మేనేజర్​పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

bank notice
బ్యాంక్ నోటీసులు
author img

By

Published : Nov 12, 2021, 8:58 PM IST

Updated : Nov 12, 2021, 10:24 PM IST

కర్ణాటక కొడగు జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడికి కరాడా గ్రామంలో బ్యాంక్​ ఆఫ్​ బరోడా బ్యాంక్​ నోటీసులు జారీ చేసింది. 2020లో తల్లిదండ్రులు కరోనాతో చనిపోవడం వల్ల వారు చేసిన అప్పును తీర్చాలని అందులో పేర్కొంది. ఈ విషయాన్ని బాలుడు.. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్​.

ఇదీ జరిగింది..

ప్రస్తుతం బాలుడు అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే బ్యాంక్​ ఆఫ్​ బరోడా.. బాలుడికి నోటీసులు పంపింది. తల్లిదండ్రులు చేసిన 12 లక్షలు అప్పును తీర్చారని ఆదేశించింది. దీంతో ఆ బాలుడు జిల్లా పంచాయతీ కార్యాలయంలో గురువారం సంబంధిత అధికారులకు తన గోడు వెల్లబోసుకున్నాడు. బ్యాంకు నోటీసుల కారణంగా తాను స్కూల్​కు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వివరించాడు. దీనిపై స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్.. ఇలా నోటీసులు రాజీ చేయడం కచ్చితంగా బాలల హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడింది. సంబంధిత బ్యాంక్​ మేనేజర్​పై కేసు నమోదు చేయాలని కమిషనర్​ డా. ఆంటోనీ సెబాస్టియన్​ పోలీసులను ఆదేశించారు.

ఇదీ చూడండి: టీచర్​ లైంగిక వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

Last Updated : Nov 12, 2021, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.