ETV Bharat / bharat

Bank Note Press Jobs 2023 : బ్యాంక్​ నోట్​ ప్రెస్​లో టెక్నీషియన్ ఉద్యోగాలు.. అప్లైకు 3 రోజులే ఛాన్స్​!

Bank Note Press Jobs 2023 In Telugu : కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్​ విడుదలైంది. బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 21 వరకు అవకాశం ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.

Bank Note Press Dewas Recruitment 2023
Bank Note Press Jobs Vacancy 2023
author img

By

Published : Aug 18, 2023, 2:01 PM IST

Bank Note Press Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో.. 111​ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌. ఇందులో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌, సూపర్‌వైజర్‌ సహా వివిధ జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయి. (Bank Note Press Jobs 2023) ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 21 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..
Bank Note Press Vacancy : 111 పోస్టులు

ఈ పోస్టుల వివరాలు

  • జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ - 4
  • సూపర్‌వైజర్‌ (కంట్రోల్‌) - 3
  • సూపర్‌వైజర్‌ (ప్రింటింగ్‌) - 8
  • సూపర్‌వైజర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) - 1
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (కంట్రోల్‌) - 25
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌) - 27
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఇంక్‌ ఫ్యాక్టరీ) - 15
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (సివిల్‌/ ఎన్విరాన్‌మెంట్‌) - 1
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (మెకానికల్‌/ ఎయిర్‌ కండిషనింగ్‌) - 3
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ) - 4

వయోపరిమితి
Bank Note Press Jobs Age Limit : 18-30 ఏళ్లు. నిబంధనల ప్రకారం ప్రతి పోస్టుకు ఏజ్​ లిమిట్​ను నిర్ణయించారు.

విద్యార్హతలు..

  • జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ - 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. హిందీలో 30 పదాలు, ఇంగ్లీష్‌లో నిమిషానికి 40 పదాలు చొప్పున కంప్యూటర్‌లో టైప్‌ చేయగలగాలి.
  • సూపర్‌వైజర్‌ (కంట్రోల్‌) - ప్రింటింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉండాలి. లేదంటే సంబంధిత విభాగంలో బీటెక్‌/ బీఈ, బీఎస్​ఈ ఇంజినీరింగ్‌ చేసినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
  • సూపర్‌వైజర్‌ (ప్రింటింగ్‌) - ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ చేసినవార కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సూపర్‌వైజర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) - ఐటీ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉండాలి. లేదంటే బీటెక్‌/ బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (కంట్రోల్‌) - హ్యాండ్‌ కంపోజింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌) - ప్రింటింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో రెగ్యులర్​ డిప్లొమా చేసి ఉండాలి.
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఇంక్‌ ఫ్యాక్టరీ) - అటెండెంట్‌ ఆపరేటర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, మెషినిస్ట్‌ ట్రేడ్‌, మెషినిస్ట్‌ గ్రైండర్‌ట్రేడ్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. లేదా సంబంధిత ట్రేడుల్లో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (సివిల్‌/ ఎన్విరాన్‌మెంట్‌) - ఐటీఐ వెల్డర్‌ సర్టిఫికెట్‌, సివిల్‌ (వెల్డర్‌) డిప్లొమా అర్హత ఉండాలి.
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (మెకానికల్‌/ ఎయిర్‌ కండిషనింగ్‌) - ఐటీఐ ఫిట్టర్‌ సర్టిఫికెట్‌ లేదా మెకానికల్‌ (ఫిట్టర్‌) డిప్లొమా పాసై ఉండాలి.
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ) - ఐటీఐ ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్టిఫికెట్‌ లేదా ఎలక్ట్రికల్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

గరిష్ఠ వయోపరిమితి..

  • ఎస్సీ, ఎస్టీలు - 5 ఏళ్లు
  • ఓబీసీలు - 3 ఏళ్లు
  • దివ్యాంగులు - 10 నుంచి 15 ఏళ్లు
  • ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ - 3 నుంచి 8 ఏళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితి మినహాయింపు ఉంటుంది.
  • డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు..

  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులు- రూ.200/-
  • ఇతరులు- రూ.600/-

దరఖాస్తుకు చివరి తేదీ..
Bank Note Press Jobs Last Date To Apply : 2023 ఆగస్టు 21.

పరీక్ష విధానం..
ఆన్​లైన్​లో-ఆబ్జెక్టివ్‌ టైప్​ తరహాలో పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షల తేదీలు..
సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలల్లో పరీక్షలను వేర్వేరుగా నిర్వహించవచ్చు.

వేతనాలు..
Bank Note Press Dewas Salary : ఆయా పోస్టులను అనుసరించి రూ.18,000 నుంచి రూ.1 లక్ష వరకు జీతభత్యాలు ఉంటాయి.

రెండు భాషల్లోనే..
పరీక్షల ప్రశ్నాపత్రం హిందీ లేదా ఇంగ్లీష్​ భాషల్లో మాత్రమే ఉంటుంది.

పరీక్షా సమయం..
పోస్టుల ఆధారంగా సిలబస్​ ఉంటుంది కనుక వాటికి అనుగుణంగానే ప్రశ్నలు, మార్కులు ఉంటాయి. అన్ని పోస్టుల పరీక్షలకు 120 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది.

'నో నెగటివ్ మార్కింగ్​'..
పైన తెలిపిన పోస్టులకు సంబంధించిన పరీక్షల్లో ఎటువంటి నెగెటివ్‌ మార్కింగ్​ ఉండదు.

వారికి హైదరాబాద్​లోనే..
తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్షను రాయాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్​సైట్​..
Bank Note Press Dewas Official Website : ప్రతి పోస్టుకు సంబంధించి పరీక్ష సిలబస్​ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ప్రశ్నలకు ఎన్ని మార్కులను కేటాయించారు, పరీక్షలో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే ఎలా ప్రిపేర్​ కావాలి లాంటి పూర్తి వివరాల కోసం బ్యాంక్ నోట్ ప్రెస్‌ అధికారిక వెబ్​సైట్ https://bnpdewas.spmcil.com/en/ ను చూడవచ్చు.

జాబ్​ లొకేషన్​..
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు మధ్యప్రదేశ్​ దేవాస్​లోని బ్యాంక్ నోట్​ ప్రెస్​ కార్యాలయంలో పోస్టింగ్​ పొందుతారు.

IBPS SO Vacancy 2023 : ప్రభుత్వ బ్యాంకుల్లో 1402 పోస్టులు.. వేలల్లో జీతం.. అప్లై చేసుకోండిలా..

IBPS PO Jobs : డిగ్రీ అర్హతతో 3049 బ్యాంకు పీఓ ఉద్యోగాలు.. అప్లై​ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.