ETV Bharat / bharat

కస్టమర్లకు బిగ్ అలర్ట్‌ - బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవు! - నవంబర్‌లో బ్యాంకు సెలవులు

Bank holidays in November 2023 : బ్యాంక్‌ ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్. వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి, ఆ వివరాలేంటో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

5 bank holidays in november 2023
5 bank holidays in november 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 3:46 PM IST

5 bank holidays in november 2023 : ప్రతీనెలలో వీకెండ్స్​తోపాటు కొన్ని పండగలు వస్తుంటాయి. ఒక్కోసారి ఇవి కలిసి రావడంతో.. బ్యాంకులకు వరుస సెలవులు వస్తుంటాయి. అయితే.. ఈ సెలవుల్లో కొన్ని జాతీయ సెలవులు ఉంటాయి. అంటే.. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. కానీ.. కొన్ని సెలవులు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతాయి. దీంతో.. ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకులు మాత్రమే మూసి ఉంటాయి. ఈ నవంబర్‌ నెలలో బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి, ఏ రోజున.. ఏ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

11 నవంబర్ :
నవంబరు 11 రెండవ శనివారం అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. ప్రతీ నెలలో రెండవ, నాలుగవ శనివారాలు బ్యాంకులకు సెలవు. కాబట్టి నవంబర్‌ 11 తేదీన దేశంలోని అన్ని బ్యాంకులూ మూసి ఉంటాయి.

12 నవంబర్ :
12 నవంబర్ తేదీన ఆదివారం వస్తోంది. అంతేకాదు.. ఈ రోజున దీపావళి పర్వదినం కూడా. దేశం మొత్తం ఈ పండగను వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. అంటే.. వరుసగా రెండు రోజులు జాతీయ సెలవులు.

Bank Holidays In November 2023 : నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

నవంబర్ 13 :
నవంబర్ 13 తేదీన సోమవారం అవుతోంది. త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాల్లో ఈ రోజున (నవంబర్ 13), గోవర్ధన్ పూజ, లక్ష్మీపూజ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సోమవారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

నవంబర్ 14 :
నవంబర్ 14 తేదీన మంగళవారం వస్తోంది. ఈ రోజున గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో విక్రమ సంవత్, లక్ష్మీ పూజ ఘనంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

నవంబర్ 15 :
నవంబర్ 15 తేదీన బుధవారం అవుతోంది. ఈ రోజున సిక్కిం, మణిపుర్, ఉత్తరప్రదేశ్, బంగాల్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి, లక్ష్మీ పూజ, నింగల్ చక్కుబా వంటి పండుగలను జరుపుకుంటారు. ఈ కారణంగా బుధవారం కూడా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఈ విషయాన్ని గుర్తించి.. కస్టమర్లు ముందు జాగ్రత్తగా బ్యాంకు పనులు చక్కబెట్టుకుంటే.. ఎలాంటి ఇబ్బందులూ పడకుండా చూసుకోవచ్చు. అయితే.. బ్యాంకులకు సెలవు ఉన్న రోజుల్లో కూడా నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, ATM సేవలు అందుబాటులోనే ఉంటాయి.

మీ సేవింగ్స్​ అకౌంట్​ ఇన్​యాక్టివ్ అయ్యిందా? - ఏం జరుగుతుందో తెలుసా?

యూపీఐతో క్రెడిట్​ కార్డును లింక్ చేయాలనుకుంటున్నారా? లాభాలతో పాటు ఈ నష్టాలు కూడా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.