ETV Bharat / bharat

బలగాల కాల్పుల్లో ఇద్దరు బంగ్లాదేశీ స్మగ్లర్లు హతం

బంగాల్​ కూచ్​ బెహార్​లోని సరిహద్దు గుండా బంగ్లాదేశ్​లోకి పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు స్మగ్లర్లను(bangladesh cattle smugglers) హతమార్చాయి బీఎస్​ఎఫ్​ బలగాలు. ముందుగా వెళ్లిపోవాలని హెచ్చరించినా.. ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసినందుకు కాల్పులు జరిపినట్లు తెలిపాయి.

Bangladeshi smugglers killed
వెదురు బొంగుల ద్వారా స్మగ్లింగ్​
author img

By

Published : Nov 12, 2021, 10:58 AM IST

సరిహద్దుల గుండా భారత్​లోకి ప్రవేశించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీ స్మగ్లర్లను(bangladesh cattle smugglers) తరిమికొట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో స్మగ్లర్లకు, బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు దుండగులను మట్టుబెట్టాయి. ఈ సంఘటన(cattle smuggling india-bangladesh border) బంగాల్​ కూచ్​ బెహార్​ జిల్లాలోని భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దులో(india-bangladesh border) శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.

వెదురు బొంగులను ఉపయోగించి సరిహద్దు కంచె దాటిన దుండగులు.. పశువులను అవతలివైపునకు(cattle smugglers) చేరవేసే ప్రయత్నం చేశారని బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. వారిని గమనించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించి.. చెదరగొట్టేందుకు ముందుగా జవాన్లు ప్రాణాపాయం లేని మందుగుండు సామగ్రిని వినియోగించినట్లు పేర్కొన్నారు. అయితే.. బీఎస్​ఎఫ్​ దళాలపై వారు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారని, దాంతో కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు స్మగ్లర్లు హతమైనట్లు వెల్లడించారు.

స్మగ్లర్ల దాడిలో ఓ జవానుకు గాయాలవగా.. ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.