ETV Bharat / bharat

బెంగళూరు ఎయిర్​పోర్టులో 'రోసెన్​బర్'​ - దక్షిణాసియాలోనే తొలిసారి

కర్ణాటకలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక వ్యవస్థతో కూడిన రోసెన్‌బర్‌ అగ్నిమాపక సిమ్యులేటర్‌ను ఏర్పాటుచేశారు. సిబ్బందికి శిక్షణ కోసం ఈ సిమ్యులేటర్‌ ఉపయోగిస్తున్నారు. దీంతో దక్షిణాసియాలోనే రోసెన్‌బర్‌ సిమ్యులేటర్‌ కల్గిన ఏకైన విమానాశ్రయంగా బెంగళూరు విమానాశ్రయం నిలిచింది(bangalore airport news).

Bangalore Airport, బెంగళూర్ ఎయిర్​పోర్టు
బెంగళూరు ఎయిర్​పోర్టులో రోసెన్​బర్ అగ్నిమాపక సిమ్యులేటర్​
author img

By

Published : Nov 23, 2021, 4:01 PM IST

Updated : Nov 23, 2021, 5:11 PM IST

బెంగళూరు ఎయిర్​పోర్టులో 'రోసెన్​బర్'​ - దక్షిణాసియాలోనే తొలిసారి

అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి మంటలను ఆర్పేందుకు ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తున్న రోసెన్‌బర్‌ సంస్థ.. అత్యాధునిక వ్యవస్థతో కూడిన అగ్నిమాపక యంత్రాలను తయారు చేసింది. ముఖ్యంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలికి వేగంగా చేరుకునేందుకు వీలుగా ఈ యంత్రాలను రూపొందించింది(bangalore airport news). అలాంటి రోసెన్‌బర్‌ అగ్నిమాపక యంత్రాలను దక్షిణాసియాలోనే తొలిసారిగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేశారు. వీటిని నడిపేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రోసెన్‌బర్‌ సిమ్యులేటర్‌ను కూడా ఏర్పాటుచేశారు.

Bangalore Airport, బెంగళూర్ ఎయిర్​పోర్టు
బెంగళూరు ఎయిర్​పోర్టులో రోసెన్​బర్ అగ్నిమాపక సిమ్యులేటర్​
Bangalore Airport, బెంగళూర్ ఎయిర్​పోర్టు
బెంగళూరు ఎయిర్​పోర్టులో రోసెన్​బర్ అగ్నిమాపక సిమ్యులేటర్​

55 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో ఉండే ఈ సిమ్యులేటర్‌లో రోసెన్‌బర్‌ అగ్నిమాపక యంత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీని వల్ల నిజమైన రోసెన్‌బర్‌ అగ్నిమాపక వాహనాలు నడిపినట్లే ఉంటుంది. సిబ్బందికి మెరుగైన మెళకువలు నేర్పేందుకు సహకరిస్తుంది. ఈ సిమ్యులేటర్‌లో ఏర్పాటు చేసిన స్టీరింగ్‌, ఇతర వ్యవస్థల ద్వారా రోసెనబర్ అగ్నిమాపకయంత్రం కంట్రోలింగ్‌ వ్యవస్థను అవగాహన చేసుకోవచ్చు. వీటిని ఆపరేట్‌ చేస్తూ ఘటనా స్థలంలో మంటలు అర్పేలా పూర్తిస్థాయిలో శిక్షణ పొందవచ్చు(rosenbauer firefighting simulator).

అత్యాధునిక రోసెన్‌బర్‌ అగ్నిమాపక యంత్రాలు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి చేరుకునేందుకు ఉంటాయి. ఇప్పటికే 8 రోసెన్‌బర్‌ యంత్రాలను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. బెంగళూరు విమానాశ్రయం భద్రత రీత్యా మరిన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణాసియాలోనే రోసెన్‌బర్‌ సిమ్యులేటర్‌ కలిగిన ఏకైక విమానాశ్రయం బెంగళూరు విమానాశ్రయమేనని అక్కడి అధికారులు చెప్పారు. దేశంలో ఉన్న ఇతర విమానాశ్రయాల సిబ్బందికి కూడా రోసెన్‌బర్ అగ్నిమాపక సిమ్యులేటర్ ద్వారా శిక్షణ ఇచ్చే అవకాశముందని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు(bangalore airport).

ఇదీ చదవండి: పిల్లలతో ఓరల్​ సెక్స్ తీవ్ర నేరం కాదు- హైకోర్టు తీర్పు

Last Updated : Nov 23, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.