Bangalore Accident: కర్ణాటక బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతిచెందారు. ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అతివేగమే కారణం..
నైస్రోడ్డు ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు శుక్రవారం రాత్రి కారును ఢీకొట్టింది. అయితే.. కేరళకు చెందిన ఈ కారులో నలుగురు టెకీలు ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు తమిళనాడు నుంచి వచ్చినట్లు గుర్తించారు.
ఈ ఘటనలో మరో రెండు కార్లు, నాలుగు కంటైనర్ వాహనాలు కూడా ధ్వంసమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం దాదాపు 8 కిలోమీటర్ల మేరకు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:
లాక్డౌన్లో రోజుకు 20గంటలు కష్టపడి.. 145 సర్టిఫికెట్లు సాధించి..