ETV Bharat / bharat

నీటి గుంతలో పుట్టిన ఏనుగు పిల్లలు.. 'ఆపరేషన్​ ట్విన్స్​'తో సేఫ్​గా బయటకు.. - elephants video viral

Bandipur twin elephant: నీట మునిగిపోతున్న కవల ఏనుగు పిల్లలను కాపాడారు అటవీ శాఖ అధికారులు. ఈ ఘటన కర్ణాటకలోని బందీపూర్ అడవిలో జరిగింది. క్షేమంగా ఈ ఏనుగు పిల్లలను తల్లి వద్దకు చేర్చారు.

bandipur twin elephant
కవల ఏనుగు పిల్లలు
author img

By

Published : Apr 22, 2022, 9:21 AM IST

కవల ఏనుగు పిల్లలు

Bandipur twin elephant: నీటి గుంతలో కవల ఏనుగు పిల్లలకు జన్మనిచ్చింది ఓ ఏనుగు. ఆ బుజ్జి ఏనుగులు అందులో మునిగిపోతుండగా అటవీ శాఖ అధికారులు రెస్క్యూ అపరేషన్​ నిర్వహించి వాటిని కాపాడారు. ఈ ఘటన కర్ణాటకలోని బందీపూర్​ అడవిలో జరిగింది.

bandipur twin elephant
కవల ఏనుగు పిల్లలు
bandipur twin elephant
తల్లి చెంతకు చేరిన కవల ఏనుగు పిల్లలు

ఈ ఏనుగు పిల్లలను కాపాడడం కోసం అటవీ శాఖ అధికారులు 'ఆపరేషన్ ట్విన్స్'​ పేరుతో సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం రెండు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం తల్లి ఏనుగు తమపై దాడి చేయకుండా.. ఏనుగు పిల్లల నుంచి దానిని దూరంగా తరమడం కోసం ఏర్పడగా, మరో బృందం ఏనుగు పిల్లలను నీటి గుంత నుంచి బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ గుంతలో నుంచి ఏనుగు పిల్లలను పైకి ఎక్కేలా చేశారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తల్లి ఏనుగు వద్దకు పిల్ల ఏనుగులను సురక్షితంగా చేర్చారు అధికారులు. క్షేమంగా బయటపడ్డ పిల్లలతో అడవిలోకి వెళ్లిపోయింది ఆ ఏనుగు.

ఏనుగు పిల్లల మెడ వరకు నీరు ఉండడం వల్ల మునిగిపోతాయనే భయం వేసింది. వాటిని నీటి గుంత నుంచి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఈ ఆపరేషన్​ అధికారులకు, సిబ్బందికి మంచి అనుభవంతో పాటు ఆనందాన్ని కలిగించింది.

-రమేష్ కుమార్, అటవీశాఖ అధికారి

ఇదీ చదవండి: మాజీ సహోద్యోగిపై కోపం.. పబ్లిక్ టాయిలెట్లలో అలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.