Bandi Sanjay Remanded Till 19th of March: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు హనుమకొండ జిల్లా మెజిస్ట్రేట్ ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. ఆయనకు 2 వారాల పాటు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో అతనిని ఏ-1 నిందితుడిగా ఉన్నారు. హనుమకొండ నుంచి పోలీసులు తనని కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందు జిల్లా మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచిన సందర్భంగా.. హనుమకొండలోని మెజిస్ట్రేట్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని జైలుకు తరలించనున్నారని తెలిసి.. బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. రెండు వారాలు రిమాండ్ విధించిన వెంటనే.. మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఇదే విషయంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను బీజేపీ దాఖలు చేయనుంది. ఈ కేసులో బండి సంజయ్‌ను విచారించడానికి.. పోలీసులు 3 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది.
మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు బండి సంజయ్.. పోలీసులు తనపట్ల దురుసుగా ప్రవర్తించారని తన లాయర్లకు చెప్పారు. తనకు అయిన గాయాలను చొక్కా విప్పి వారికి చూపించారు. పోలీసుల తీరును బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు వివరించారు. అనంతరం బండి సంజయ్‌ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట ఆయనను హాజరు పరిచారు. న్యాయమూర్తి నివాసంలో జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచి.. రెండు వారాలు రిమాండ్‌ను విధించారు.
అంతకు ముందు కోర్టులో హాజరుపర్చేందుకు.. కమలాపురం పోలీసులు పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. అందులో ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ప్రధాన నిందితునిగా బండి సంజయ్‌ను చేర్చుతూ.. ఏ-1గా ఉంచింది. ఆ తర్వాత పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులతో తెప్పించిన.. జర్నలిస్టు ప్రశాంత్‌ను ఏ-2గా చేర్చింది. అతను బండి సంజయ్‌తో ఎక్కువగా వాట్సప్‌లో ఈ విషయంపై ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత ఏ-3గా ల్యాబ్ అసిస్టెంట్ మహేశ్, ఏ-4గా ఉన్న విద్యార్థి మైనర్ కావడం వల్ల అతని వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ఏ-5 ఎం. శివ గణేశ్, ఏ-6 పోగు సుభాష్, ఏ-7 పోగు శశాంక్, ఏ-8 దూలం శ్రీకాంత్, ఏ-9 పెరుమాండ్ల శ్రామిక్, ఏ-10 పోతనబోయిన వర్షిత్లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ అరెస్ట్‌లను నిరసిస్తూ.. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ.. తమ ఆందోళనను తెలియజేశారు. తనని అరెస్ట్ చేసిన తర్వాత అతని ఆచూకీ కోసం బొమ్మనరామారం వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆందోళనలు చేస్తున్న వారిని ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. మరోవైపు హైకోర్టులో హెబియస్కార్పస్ను.. బండి సంజయ్ ఆచూకీ కోసం బీజేపీ వేసింది. అయితే విచారణను రేపు న్యాయస్థానం విచారించనుంది.
ఇవీ చదవండి: