ETV Bharat / bharat

పంపు ద్వారా చిన్నారికి ఊపిరి.. డబ్బుల్లేక ఎయిమ్స్ బయటే జీవనం.. సాయానికి సీఎం హామీ - బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడుతున్న చిన్నారి

ఫుట్​పంపు ద్వారా ఓ తల్లి తన 13 నెలల చిన్నారికి ఊపిరి పోస్తోంది. బ్రెయిన్ ట్యూమర్​, క్యాన్సర్​తో పోరాడుతున్న బాలుడికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పంపు ద్వారా శ్వాస అందించాల్సిన పరిస్థితి నెలకొంది.

baby breathing through foot pump
ఫుట్​పంపుతో చిన్నారికి ఊపిరి అందిస్తున్న తల్లి
author img

By

Published : Nov 15, 2022, 9:21 PM IST

ఫుట్​పంపు ద్వారా చిన్నారి ఊపిరి.. ఫుట్​పాత్​పైన 5నెలలుగా జీవనం..

ఓ తల్లి తన 13 నెలల చిన్నారికి ఫుట్​పంపు ద్వారా ఊపిరి పోస్తున్న వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది. ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో ఈ ఘటన జరిగింది. రాయ్​పుర్​ ఎయిమ్స్ బయట గత 5 నెలలుగా ఫుట్​పాత్​పైన బాధిత కుటుంబం బిడ్డతో కలిసి జీవిస్తోంది. హర్ష అనే బాలుడు బ్రెయిన్ ట్యూమర్​, క్యాన్సర్​తో బాధపడుతున్నాడు. అందువల్ల అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి ఫుట్​పంపు ద్వారా అతడి తల్లి ఆక్సిజన్ పెడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

baby breathing through foot pump
చిన్నారికి ఆక్సిజన్​ను ఎక్కిస్తున్న తల్లి

"నా బిడ్డ బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. మొదట్లో ఆరోగ్యం బాగానే ఉన్నా ఆ తర్వాత శరీరంలో కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయలేదు. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. మందులకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. ఇక డబ్బులు లేక ఫుట్​పాత్​పైన జీవనం సాగిస్తున్నాం. రాయ్​పుర్ ఎయిమ్స్​లో ఉచితంగా చికిత్స అందుతోంది. అయితే మందులకు మా వద్ద డబ్బులు లేవు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ మా బిడ్డ చికిత్స కోసం ఖర్చు చేస్తున్నాం."
-దాస్​, బాలుడి తండ్రి

సామాజిక మాధ్యమాల్లో వైరలైన వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ దృష్టికి వచ్చింది. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులకు సహాయం అందించాలని రాయ్​పుర్ కలెక్టర్​ను ఆదేశించారు.

baby breathing through foot pump
ఫుట్​పంపు ద్వారా చిన్నారికి ఊపిరి

ఇవీ చదవండి: శాంతి కాముకులా? వార్తాహరులా?.. జర్నలిస్టులంటే ఎవరు?

మరో దారుణం.. యువతిని చంపి, బావిలో శరీర భాగాలు పడేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.