ETV Bharat / bharat

Baba ka Dhaba: గిరాకీ లేక రెస్టారెంట్ మూసివేత - 'బాబా కా దాబా' అడ్రస్

'బాబా కా దాబా' పేరుతో ప్రాచుర్యం పొందిన కాంతా ప్రసాద్​ నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్​ను మూసేశాడు. ఇకపై తన పాత బండిని నడిపిస్తానని తెలిపిన ఆయన.. ఆదాయం తక్కువగా ఉన్నందు వల్లే కొత్త హోటల్​ను మూసేయాల్సి వచ్చిందని తెలిపాడు.

Baba Ka Dhaba
కాంతా ప్రసాద్
author img

By

Published : Jun 9, 2021, 12:35 PM IST

గతేడాది లాక్​డౌన్ సమయంలో​ గిరాకీ లేక.. సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు పొందిన 'బాబా కా దాబా'(Baba ka Dhaba) యజమాని కాంతా ప్రసాద్​ని కష్టాలు వెంటాడుతున్నాయి. విరాళాల ద్వారా సమకూరిన సొమ్ముతో ప్రారంభించిన రెస్టారెంట్​ ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొంటోంది. దీనితో తన పాత బండిని నడపేందుకు తిరిగి వచ్చాడు. తాను జీవించి ఉన్నంత కాలం దీనిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

Baba Ka Dhaba
పాత బండి వద్ద బిజీబిజీగా కాంతా ప్రసాద్

"నేను జీవించి ఉన్నంత వరకు ఈ దాబాను నడుపుతాను. గతేడాది లాక్​డౌన్​ సమయంలో మాకు వచ్చిన విరాళాల నుంచి నాతో పాటు నా భార్య అవసరాల కోసం రూ.20 లక్షలు పక్కనపెట్టుకున్నాం."

-కాంత ప్రసాద్, బాబా కా దాబా

'తన వినియోగదారుల్లో చాలామందికి పాత చోటు బాగా తెలుసని.. కాబట్టి దాని ద్వారా ఎక్కువ సంపాదించగలను'అని ఆయన పేర్కొన్నారు.

Baba Ka Dhaba
పాత బండి వద్ద కాంతా ప్రసాద్

"ఫిబ్రవరి 15న కొత్త రెస్టారెంట్​ని మూసేశాను. పనివారికి నెలకు రూ.36,000 చెల్లించాల్సి వచ్చింది. ఆ దుకాణం అద్దె నెలకు రూ.35,000. విద్యుత్ బిల్లు, నీటి బిల్లు సైతం ఉన్నాయి. పెట్టుబడితో పోలిస్తే, రాబడి తక్కువగా ఉంది, అందుకే దాన్ని మూసేయాల్సి వచ్చింది."

-కాంత ప్రసాద్, బాబా కా దాబా

ఇవీ చదవండి: వృద్ధ దంపతుల కష్టాలు తీర్చిన వైరల్​ వీడియో

'బాబా కా దాబా' నయా రెస్టారెంట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.