ETV Bharat / bharat

రాజస్థాన్​లో మరో 'యోగి' వస్తారా? సీఎం రేసులో బాబా బాలక్​నాథ్​! - రాజస్థాన్ బాబా బాలక్ నాథ్

Baba Balak Nath Rajasthan Elections : యోగి ఆదిత్యనాథ్​ లాంటి ఆధ్యాత్మిక నేత.. రాజస్థాన్​ ముఖ్యమంత్రి అవుతారా? యువ, ఫైర్​బ్రాండ్​ నాయకుడు అయిన బాబా బాలక్​నాథ్​కు జైపుర్​ అధికార పీఠం దక్కుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఎవరీ బాబా బాలక్​నాథ్​?

Baba Balak Nath Rajasthan Elections
Baba Balak Nath Rajasthan Elections
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 6:01 PM IST

Baba Balak Nath Rajasthan Elections : బాబా బాలక్​నాథ్​.. బీజేపీ యువ, ఫైర్​బ్రాండ్ నాయకుడు. అల్వార్​ నుంచి లోక్​సభకు ఎన్నికై.. 'రాజస్థాన్​ యోగి ఆదిత్యనాథ్​'గా రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక నేత. సన్యాసి జీవితం, వేషధారణ, రాజకీయ ప్రస్థానం మొదలు.. అన్నింట్లోనూ ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​తో సారూప్యత కలిగి ఉన్నారు బాబా బాలక్​నాథ్. ఇప్పుడు రాజస్థాన్ శాసనసభ ఎన్నికల వేళ ఆయన పేరు సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం అభ్యర్థుల రేసులో బాబా బాలక్​నాథ్ కూడా ఉన్నారన్న వార్తలే ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు.. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సహా మరికొందరు ప్రముఖులతో పోటీ పడుతున్నారు బాబా బాలక్​నాథ్​. ఇప్పటికే రాజస్థాన్ శాసనసభలో సీటు ఖరారు చేసుకున్న ఆయన్ను.. కమలదళం జైపుర్​ అధికార పీఠంపై కూర్చోపెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికల్లో తిజారా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు బాబా బాలక్​నాథ్. కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్​పై 6,173 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బాలక్​నాథ్ ఎంపీగా ఉండగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం. 2019లో లోకసభ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నేత జితేంద్ర సింగ్​ను ఆయన ఓడించారు. పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతూ ఉండగానే.. బీజేపీ రాజస్థాన్​ శాసనసభ ఎన్నికల్లో రంగంలోకి దింపింది. 2017లో ఎంపీగా ఉన్న యోగిని ఉత్తర్​ప్రదేశ్​ సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ. ఇప్పుడు అదే తరహాలో బాబా బాలక్​నాథ్​కు అవకాశం వస్తుందా అని రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

సీఎం పదవి దక్కడంపై బాబా బాలక్​ నాథ్ స్పందించారు. 'ఈ గెలుపు తిజారా ప్రజలు, పార్టీ కార్యకర్తల వల్లే సాధ్యమైంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము పని చేస్తున్నాం. సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది.' అని ఆదివారం అల్వార్​లో మీడియా ప్రతినిధులతో చెప్పారు.

  • #WATCH | Alwar, Rajasthan: On leading on his seat in Tijara, BJP Candidate Yogi Balaknath says, "This seat is won by our party workers and the people of Tijara. They have given me the fortune of serving them... All the decisions are taken under the guidance of PM Modi..." pic.twitter.com/Ld44TkO7qt

    — ANI (@ANI) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాబా బాలక్​నాథ్ కొహ్రనా గ్రామంలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి సన్యాసం తీసుకుసుకుని ఆశ్రమంలో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్​లాగానే బాబా బాలక్​నాథ్​ కూడా నాథ్​ కమ్యూనిటీ నుంచి వచ్చారు. తన గురువు మహంత్​ చంద్​నాథ్​ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

రాజస్థాన్​లో బీజేపీ హవా- వసుంధర, గహ్లోత్ లీడింగ్- పుంజుకున్న పైలట్​

రాజస్థాన్​లో బీజేపీ దూకుడు-వసుంధర భారీ విక్టరీ- గహ్లోత్​, పైలట్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.