ETV Bharat / bharat

Azadi ka Amrit Mahotsav: భారతీయ ధీరత్వానికి.. వైస్రాయ్‌ గజగజలాడిన వేళ

బానిసత్వంలో బతుకుతున్నా... భారతావని అనుక్షణం ఆంగ్లేయుల శృంఖలాలను ఛేదించేందుకు ప్రయత్నించింది. ఎక్కడో అక్కడ.. హింసో, అహింసో.. ఏదోరూపంలో పోరాటం కొనసాగింది. ఎవరి స్థాయిలో వారు ఎదురొడ్డేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏకంగా దేశాధినేత వైస్రాయ్‌కే గురిపెట్టి.. గజగజలాడించారు భారత స్వాతంత్య్రోద్యమ వీరులు! కొత్త రాజధాని కొత్తదిల్లీలో నడిబొడ్డున అంతా చూస్తుండగానే 1912 డిసెంబరు 23న వైస్రాయ్‌ హార్డింగ్‌పై బాంబులతో దాడి చేశారు. భారత్‌లోని బ్రిటిష్‌ యంత్రాంగాన్నే కాదు.. బ్రిటన్‌లో ప్రభుత్వాన్నీ భయపెట్టారు.

Azadi ka Amrit Mahotsav
వైస్రాయ్‌ గజగజలాడిన వేళ...
author img

By

Published : Dec 23, 2021, 11:23 AM IST

Azadi ka Amrit Mahotsav: 1911లో దేశ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చి.. చకచకా పనులు మొదలెట్టింది బ్రిటిష్‌ ప్రభుత్వం. అప్పటి వైస్రాయ్‌ చార్లెస్‌ హార్డింగ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ రాజధాని మార్పు, కొత్త రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. కొన్ని నిర్మాణాలు పూర్తికాగానే ప్రవేశానికి ముహూర్తం పెట్టారు. 1912 డిసెంబరు 23న. తన భార్యతో పాటు గజారోహణం చేసి.. కొత్త పట్టణంలోకి అడుగుపెట్టడానికి అంగరంగ వైభవంగా అంబారీపై ఊరేగుతూ వచ్చారు. దారిపొడవునా పూలవర్షం కురుస్తుంటే.. వైస్రాయ్‌ హార్డింగ్‌ గర్వంగా ముందుకు సాగాడు. ఊరేగింపు చాంద్‌నీచౌక్‌ గడియారం వద్దకు రాగానే.. పూలవర్షంలో భాగంగానే.. బాంబు కూడా పడింది. వైస్రాయ్‌, ఆయన భార్య కూర్చున్న పందిరిమంచంలాంటి సింహాసనం పేలిపోయింది. బాంబుధాటికి వైస్రాయ్‌ దంపతులకు ఛత్రంపట్టిన సిపాయి మరణించగా.. హార్డింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాంబులో కూర్చిన ఇనుప వస్తువులన్నీ శరీరంలో గుచ్చుకుపోయాయి. ఆయన భార్య స్వల్పగాయాలతో బయటపడింది. మొత్తానికి చావుతప్పి కన్నులొట్టబోయినట్లయింది హార్డింగ్‌కు.

భారత్‌లో తమ రాజ ప్రతినిధి వైస్రాయ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేసింది. బెంగాల్‌, పంజాబ్‌ల్లోని విప్లవవాద సంస్థలన్నింటినీ గాలించింది. వారి కార్యకలాపాలను కట్టడి చేసింది. అయినా.. దిల్లీ బాంబు దాడి కారకులను వెంటనే పట్టుకోలేకపోయింది. రెండేళ్ల తర్వాత ఐదుగురిని గుర్తించగలిగింది. అప్పటికీ ఈ దాడికి అసలైన సూత్రధారి మాత్రం దొరకలేదు. మూడేళ్ల పాటు ఆంగ్లేయుల చేతికి చిక్కకుండా దాగుడుమూతలాడుతూ ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టిన ఆ వీరుడు.. 1915లో జపాన్‌కు వెళ్లిపోయారు. ఆయనే రాస్‌ బిహారీ బోస్‌!

చీరకట్టుకొని అమ్మాయిగా...

బ్రిటిష్‌ ప్రభుత్వంలోనే పనిచేస్తూ.. బెంగాల్‌ విప్లవ సంస్థల్లో చురుగ్గా ఉన్న రాస్‌ బిహారీ బోస్‌.. దిల్లీలో వైస్రాయ్‌పై బాంబుదాడికి ధైర్యం చేశారు. అందుకు భారీ ప్రణాళికే రచించారు. 1911 దీపావళి సమయంలోనే కొంతమంది ధైర్యవంతులైన సహచరులతో దిల్లీ చేరుకున్నారు. దీపావళి బాంబుల మధ్యే తాము తయారు చేసుకున్న బాంబులను కూడా ప్రయోగించి చూసుకున్నారు. బాగానే పేలుతున్నాయనే నమ్మకం కలిగాక దాదాపు ఏడాదిపాటు వేచి చూశారు. ఈలోపు... దేహ్రాదూన్‌లో తాను పనిచేసే అటవీ పరిశోధన సంస్థలో బసంత్‌ బిశ్వాస్‌ అనే సహచరుడితో కలసి అడపాదడపా బాంబులను చిన్నమోతాదులో ప్రయోగించి చూసుకునేవారు. చీరకడితే అచ్చం అమ్మాయిలా అనిపించే బసంత్‌ బిశ్వాస్‌ను తీసుకొని.. డిసెంబరు 22నే చాంద్‌నీచౌక్‌ ప్రాంతంలో తిరిగి వచ్చారు. వారికి స్థానికంగా.. లాలా హనుమంత్‌ సహాయ్‌, భాయ్‌ బాల్‌ముకుంద్‌, అమీర్‌ చంద్‌, అవధ్‌ బిహారీలు కలిశారు. మరుసటి రోజు వైస్రాయ్‌.. ఊరేగింపు రాగానే ఈ బృందం తన పని కానిచ్చింది. అయితే అనుకున్నట్లుగా ఇళ్లపైన నిలబడిన మహిళల్లో కలసిపోయిన బసంత్‌ చేతుల్లోంచి కాకుండా.. కింది నుంచి మరొకరు ఏనుగుపైకి విసిరినందునే బాంబు సరిగ్గా లక్ష్యాన్ని చేరలేదన్నది తర్వాత తేలిన విషయం. మొత్తానికి కొత్త రాజధానిలో హల్‌చల్‌ సృష్టించిన ఈ దాడి తర్వాత.. 1914లో లాలా హనుమంత్‌, బసంత్‌ బిశ్వాస్‌, బాల్‌ముకుంద్‌, అమీర్‌చంద్‌, అవధ్‌ బిహారిలు దొరికారు. తన తండ్రి అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా బసంత్‌ను అరెస్టు చేశారు. వీరిలో హనుమంత్‌ను అండమాన్‌కు పంపించారు. మిగిలిన నలుగురికీ ఉరిశిక్ష విధించారు. ఆంగ్లేయులకు దొరక్కుండా జపాన్‌ వెళ్లిన రాస్‌ బిహారీ బోస్‌... అక్కడ టోక్యో పార్క్‌లో తన సహచరుడు బసంత్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:- Azadi ka Amrit Mahotsav: గాంధీజీ కఠిన శిక్ష కోరుకున్న వేళ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.