ETV Bharat / bharat

'లార్డ్​ మేయో హత్య.. బయటకు తెలిస్తే పరువు పోతుందని!' - lord meyo

AZADI KA AMRIT MAHOTSAV: ఆంగ్లేయుల రాక్షసత్వానికి ప్రతీకైన అండమాన్‌ సెల్యూలర్‌ (కాలాపానీ) జైలు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధుల మరుభూమే కాదు.. ఓ బ్రిటిష్‌ వైస్రాయ్‌ను సైతం బలి తీసుకుంది. అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం కూడా పరువు పోతుందని ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాకుండా జాగ్రత్త పడింది.

AZADI KA AMRIT MAHOTSAV
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
author img

By

Published : Mar 4, 2022, 8:16 AM IST

AZADI KA AMRIT MAHOTSAV: రాజకీయ శత్రువులను, పాలనను కూలదోయాలని కుట్రలు చేసినవారిని, విప్లవవాదులను కఠినంగా శిక్షించేందుకు.. ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన శిక్షల కాలనీయే అండమాన్‌ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌ వైపర్‌ ద్వీపం. 1789 నాటికే దీన్ని నేరగాళ్ల కారాగార కేంద్రంగా మార్చారు. కానీ మధ్యలో మలేరియా కారణంగా మూసేశారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు) తర్వాత దీన్ని పునరుద్ధరించారు. ఆగ్రా జైలు బాధ్యతలు చూస్తున్న డాక్టర్‌ జేమ్స్‌ పాటిసన్‌ వాకర్‌ను అండమాన్‌ జైలు సూపరింటెండెంట్‌గా నియమించి... 200 మంది ఖైదీలను అప్పగించి అండమాన్‌కు పంపించారు. ఏటా ఖైదీల సంఖ్య వేలల్లో పెరిగేది. ఖైదీల స్వహస్తాలతోనే నరకంలాంటి జైలుతో పాటు... అక్కడే అనేక నిర్మాణాలు, నౌకాకేంద్రం పనులు చేయించేది ఆంగ్లేయ సర్కారు. ఇలా వచ్చిన ఖైదీల్లో ఒకరు షేర్‌ అలీ. అంతకుముందు పంజాబ్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వంలో పనిచేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలోనూ బ్రిటిష్‌ సైన్యంలో భాగమయ్యాడు. ఓ హత్య కేసులో అండమాన్‌కు తరలించారు. అలా ఆంగ్లేయుల వ్యవహారశైలిపై ఆగ్రహం పెంచుకున్నాడు షేర్‌ అలీ!

lord meyo
లార్డ్ మేయో

షికార్లంటే ఎంతో ఆసక్తి చూపే అప్పటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ మేయో (రిచర్డ్‌ బ్రూక్‌)... 1872 ఫిబ్రవరి 8న భార్యతో కలసి అండమాన్‌కు వచ్చారు. కొత్త జైలును చూసి... అక్కడే ఉన్న హారియోట్‌ అనే కొండెక్కి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సాయంత్రానికి మళ్లీ పోర్ట్‌బ్లెయిర్‌కు వచ్చేందుకు పడవ ఎక్కబోతుండగా... సమీపంలో దాక్కొని ఉన్న షేర్‌ అలీ... కత్తితో ఆయన్ను పొడిచాడు. మేయో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలియగానే బ్రిటిష్‌ సర్కారు ఆందోళనకు గురైంది. కారణం... అంతకు కొద్దిరోజుల ముందే... కలకత్తా ప్రధాన న్యాయమూర్తి కూడా హత్యకు గురయ్యాడు. ఇప్పుడు వైస్రాయ్‌ హత్య గురించి తెలిస్తే... దేశంలో పరిస్థితి అదుపు తప్పుతుందని అధికారులు భావించారు. వైస్రాయ్‌కే రక్షణ లేదంటే పరువు పోతుందని, ఇతర ప్రాంతాల్లోనూ తిరుగుబాట్లు తలెత్తే ప్రమాదముందని అప్రమత్తమయ్యారు. దీంతో అండమాన్‌లో వైస్రాయ్‌ హత్యకు ఎక్కువ ప్రచారం రాకుండా, ఈ హత్యకు భారత జాతీయోద్యమానికి సంబంధం లేకుండా... షేర్‌ అలీని అమర వీరుడుగా కీర్తించకుండా... దేశంలో పరిస్థితులు దిగజారకుండా... జాగ్రత్త పడ్డారు. అసలు పెద్దగా ఏమీ జరగనట్లే వ్యవహరించారు. వెంటనే కొత్త వైస్రాయ్‌ని నియమించారు. నెల రోజుల్లో షేర్‌ అలీని ఉరికంబమెక్కించారు. మారుమూల పల్లెల్లో ఆంగ్లేయ అధికారిపై దాడి జరిగితేనే సైన్యాన్ని పంపించి మరెవ్వరూ ఎన్నడూ తలెత్తకుండా భయపెట్టేలా హంగామా చేసేది బ్రిటిష్‌ సర్కారు. అలాంటిది ఏకంగా భారత్‌లో తమ అత్యున్నత అధికారైన వైస్రాయ్‌ హత్యకు గురైతే ఎలాంటి హడావుడి లేకుండా... అసలేమీ జరగనట్లుగా వ్యవహరించింది. పరువు పోతుందని గుట్టుచప్పుడు కాకుండా కేసును త్వరత్వరగా ముగించేసింది. తర్వాత కూడా ఎక్కడా చరిత్రలో ఆ సంఘటన గురించిన ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది.

ఇదీ చదవండి: తుపాకికే తాళికట్టి.. ఆంగ్లేయులకు చిక్కబోననే ప్రతిజ్ఞ చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.