ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: సమరంలో భర్తలు.. సమిధలైన భార్యలు

Azadi Ka Amrit Mahotsav: భారత స్వాతంత్య్ర సమరంలో ఎవరూ గుర్తించని, ఎవరికీ పట్టని బాధిత వర్గం ఒకటుంది. అదే ప్రపంచాగ్నికి సమిధలైన భారత నారీమణులు! ప్రపంచ యుద్ధంలో పాల్గొంటే భారత్‌కు స్వయంప్రతిపత్తి ఇస్తారన్న మాటలు నమ్మి లక్షల మంది సగటు భారతీయ గృహిణులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి భర్తలను సాగనంపారు. చివరకు వారికి మిగిలిందేంటని చూస్తే....!

Azadi Ka Amrit Mahotsav
సమరంలో భర్తలు సమిధలు భార్యలు
author img

By

Published : Feb 6, 2022, 10:17 AM IST

Azadi Ka Amrit Mahotsav: మొదటి ప్రపంచ యుద్ధంలో సంబంధం లేని దేశంలో శత్రుత్వంలేని శత్రువుతో పోరాడాల్సిన అవసరం భారతీయులకు వచ్చింది. భారతీయులతో సంప్రదించకుండానే బ్రిటిష్‌ సర్కారు యుద్ధంలో భారత్‌నూ భాగస్వామిని చేసింది. తమ తరఫున భారతీయులనూ ప్రపంచాగ్నిలో సమిధలుగా ఖరారు చేసింది. తమ చెప్పుచేతల్లో ఉన్న రాజ సంస్థానాలు, అలవాటైన తాయిలాల ధీమాతో ఆంగ్లేయులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటికి తోడు యుద్ధంలో గెలిస్తే భారత్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామనటంతో జాతీయ కాంగ్రెస్‌ కూడా గాలానికి చిక్కింది. గాంధీ నుంచి తిలక్‌, అనీబిసెంట్‌ దాకా ప్రతి ఒక్కరూ ఊరూరా తిరిగి మరీ బ్రిటిష్‌ తరఫున భర్తీ ఏజెంట్లుగా వ్యవహరించారు. అలా దాదాపు 10 లక్షల మంది భారతీయులు సైనికులుగా మారి ఎన్నడూ వినని దేశాల్లో బ్రిటన్‌ తరఫున యుద్ధం చేయటానికి బయల్దేరారు.

కథంతా వీరిచుట్టే తిరుగుతుంది. కానీ ఇందులో కనిపించని సివంగులు భారతీయ మహిళలు! కన్నబిడ్డలను పణంగా పెట్టిన తల్లులు, తమ మాంగల్యబలాన్ని నమ్ముకొని భర్తలకు వీరతిలకం దిద్దిన భార్యలు వస్తాడో రాడో తెలియని తండ్రిని ముద్దాడి పంపిన పిల్లలు ఎంతమందో! యుద్ధానికి వెళుతున్న తమవారు అక్కడ ఇబ్బంది పడొద్దని వేల సంఖ్యలో చొక్కాలు, పైజామాలు కుట్టి పంపించారు. ముంబయిలోనైతే మహిళలు తాము అడపాదడపా దాచుకున్న సొమ్మంతటినీ విరాళాలుగా సేకరిస్తే ఆ కాలంలోనే రూ.2లక్షలు జమైంది. బెంగాల్‌లో మహిళలు తమ ఆభరణాలను కూడా విరాళంగా ఇచ్చారు. అలెగ్జాండ్రియాలో ఆసుపత్రికి కావాలంటే భారతీయ నారీమణుల చేతులు చకచకా కదిలాయి. నెలరోజుల్లో 3వేల దుప్పట్లు, దిండ్లు, కంబళ్లు, వెయ్యి పైజామాలు ఇతర దుస్తులను తయారు చేసి ఆగమేఘాలపై పంపించారు. ఆంగ్లేయులంటే తమ అన్నదమ్ములన్నట్లే యుద్ధం మనదే అన్నట్లుగా మమేకమైపోయారు.

అలా అమ్మలు, అర్థాంగులు, అమ్మాయిలు ఆశీర్వదించగా యుద్ధానికి బయలుదేరిన భారతీయ సైనికుల్లో 75వేల మంది వీరమరణం పొందారు. చాలామంది జాడ తెలియలేదు. వణికించే చలికాలంలో ఐరోపాలో యుద్ధ రంగంలోకి దిగిన భారతీయ సైనికులకు వెచ్చటి ఉన్ని వస్త్రాలను అందజేయటంలో బ్రిటన్‌ విఫలమైంది. దీంతో ఇంటి నుంచి తీసుకెళ్లిన కాటన్‌ పైజామాలతోనే గడపాల్సి వచ్చింది. చాలామంది సుదీర్ఘ చలిని తట్టుకోలేక అనారోగ్య సమస్యలు తలెత్తి చనిపోయారు. బ్రిటన్‌ నుంచి యుద్ధానికి వచ్చిన ఆంగ్లేయులు మధ్యమధ్య స్వదేశానికి వెళ్లి విరామం తీసుకోగా మనవాళ్లు దూరాభారం నేపథ్యంలో నాలుగేళ్లు అక్కడే గడపాల్సి వచ్చింది.

యుద్ధానంతరం కూడా చాలా మంది ఇంటికి తిరిగి రాకపోవటంతో మతిస్థిమితం కోల్పోయిన ఇల్లాళ్లు, తల్లులు ఎంతమందో! భర్త చనిపోయారనే సందేశంతో కుమిలిపోయి తమతమ సంప్రదాయాల ప్రకారం మరుదులను పెళ్లి చేసుకున్నవారు మరికొందరు. విషాదంఏమిటంటే... ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది భర్తలు తిరిగి రావటంతో... అల్లకల్లోలమైన బంధాలు ఇంకొన్ని! యుద్ధం కారణంగా తలెత్తిన ఆర్థిక సామాజిక ఇబ్బందుల్ని ఆడబిడ్డలు ఎలా ఎదుర్కొన్నారో వారికే తెలుసు. ఇలా అటు రణరంగంలో మగవాళ్లు... ఇటు ఇళ్లలో ఆడబిడ్డలు తమదిగాని యుద్ధం చేశారు.

చివరకు మిగిలిందేంటంటే...

ఇంత కష్టపడ్డా చివరకు సాధించింది ఏమైనా ఉందా అంటే అంతా శూన్యం! భారత స్వయం ప్రతిపత్తికి మొండిచేయి చూపించిన బ్రిటిష్‌ ప్రభుత్వం యుద్ధం ముగిశాక మరణించిన సైనికుల భార్యలకు పింఛన్ల విషయంలోనూ అన్యాయంగా వ్యవహరించింది. పింఛన్‌ పొందాలంటే ఆ సైనికుడి భార్య కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని నిరూపించుకోవాలని షరతు విధించింది. అన్నింటికిమించి యుద్ధంలో చనిపోయిన సైనికుడు నిజంగానే బాగా సేవ చేశాడా లేదా అనేది ప్రధాన అంశంగా చూడాలని చిత్రమైన మెలిక పెట్టింది. చనిపోయిన సైనికుడి ప్రవర్తన, ఎన్నాళ్ల నుంచి సర్వీసులో ఉన్నాడు, పెళ్లి ఎప్పుడైందనే విషయాలను కూడా దీనికి ముడిపెట్టింది. దీంతో మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు చాలామంది... అర్జీలు ఇవ్వడంలోనే ముసలివాళ్లయ్యారు.

ఇదీ చూడండి: 'ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే ఇప్పుడు నాపై దాడి చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.