ఆయుష్ మంత్రిత్వ శాఖకు, డబ్ల్యూహెచ్ఓ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆయుష్కు చెందిన ఓ నిపుణుడు డబ్ల్యూహెచ్ఓకు బదిలీ కానున్నారు. ఇందుకు సంబంధించి ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటెచా, డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయ ఆసియా డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆగ్నేయ ఆసియాలో ప్రాంతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకే కేంద్రంతో డబ్ల్యూహెచ్ఓ ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఆగ్నేయ దేశాల్లో సంప్రదాయ వైద్యాన్ని బలపరిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోంది. యోగా, ఆయుర్వేదం సహా పలు సంప్రదాయ వైద్యాలపై ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓతో అనేక సార్లు చర్చించామని కొటేచా వెల్లడించారు. భారత్ ప్రాంతీయ వైద్యం.. ఆగ్నేయ ఆసియా సహా ఆఫ్రికా, ఐరోపా, లాటిన్ అమెరికాల్లో ప్రాచూర్యం పొందినట్లు ప్రకటనలో ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి : బలగాల ఉపసంహరణ: చైనా ఉచ్చులో భారత్?