Ayodhya Ram Mandir Vishwa Hindu Parishad : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న నిర్వహించనున్న మహా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేసే పనిలో ఆలయ ట్రస్ట్ నిమగ్నమై ఉంది. మరోవైపు, ఈ కార్యక్రమానికి ఎంత మంది వస్తారు, వారికి ఆహార పానీయాలు, బస చేయడానికి ఏక్కడ ఏర్పాట్లు చేయాలన్న బాధ్యతను విశ్వహిందూ పరిషత్ తీసుకుంది.
ఈ కార్యక్రమం నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 127 మందికిపైగా కమ్యూనిటీ సభ్యులు, సాధువులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రతినిధి దినేశ్ చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇంటినుంచే చూసేలా ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమాచారాన్ని అందరికి చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారంటే..?
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రెండున్నర వేల మంది ప్రముఖులు, ఆరు వేల మందికి పైగా సాధువులు హాజరుకానున్నట్లు దినేశ్ చంద్ర తెలిపారు. అలానే విశ్వహిందూ పరిషత్ తరపున వెయ్యి మందికిపైగా కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు కార్యక్రమానికి విచ్చేస్తున్నారని తెలిపారు. వీరికి భాషపరమైన ఇబ్బందులు కలగకుండా స్పీకర్లను ఏర్పాట్లు చేస్తున్నారు వివరించారు.
-
श्री राम जन्मभूमि मंदिर निर्माण स्थल पर रात्रि काल में लिए गए चित्र
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Pictures taken in night at Shri Ram Janmabhoomi Mandir construction site. pic.twitter.com/QVKMWoqLOY
">श्री राम जन्मभूमि मंदिर निर्माण स्थल पर रात्रि काल में लिए गए चित्र
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 6, 2023
Pictures taken in night at Shri Ram Janmabhoomi Mandir construction site. pic.twitter.com/QVKMWoqLOYश्री राम जन्मभूमि मंदिर निर्माण स्थल पर रात्रि काल में लिए गए चित्र
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 6, 2023
Pictures taken in night at Shri Ram Janmabhoomi Mandir construction site. pic.twitter.com/QVKMWoqLOY
ఆలయానికి ముందే టెంట్ సిటీ..
'సుమారు 15 వేల మంది బస చేసేందుకు టెంట్ సిటీని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీరామజన్మభూమి స్థలానికి రెండు కిలోమీటర్ల ముందు ఖాళీగా ప్రాంతంలో ఈ టెంట్ సీటీని ఏర్పాటు చేస్తున్నాం. 2025లో కుంభమేళా జరిగినప్పుడు వచ్చే సాధువులు కూడా ఈ ప్రదేశంలో బస చేయవచ్చు. కాలినడకన రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవరసం లేకుండా వాహనాలను ఏర్పాట్లు చేస్తున్నాం' అని దినేశ్ వివరించారు.
టెంట్ సిటీలో ఓపెన్ కిచెన్.. టెంట్ సిటీకి వచ్చిన వారందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం టీ ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతిరోజు సుమారు 15 వేల మందికి అన్నపానీయాలు అందించేలా చూస్తున్నామని దినేశ్ చెప్పారు. 'సాధువుల కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేస్తారు. ఈ ఆహారాన్ని తీసుకురావడానికి కోసం వెయ్యికి పైగా వాహనాలను ఏర్పాట్లు చేస్తున్నా'మని దినేశ్ తెలిపారు. చలికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి నేలపై ప్లైవుడ్‌ను పరిచి.. కార్పెట్లు, పరుపులు వేస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య రామాలయం ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం- దేశంలోని ప్రతి ఇంటికీ అక్షతలు