ETV Bharat / bharat

2,500 ఏళ్లు చెక్కు చెదరకుండా అయోధ్య రామాలయం- అరుదైన ఆకారంలో గర్భగుడి

Ayodhya Ram Mandir Unique Features : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా డిజైన్​ చేసినట్లు ఆర్కిటెక్ట్​ ఆశీశ్​ సోంపురా తెలిపారు. ఆలయ నిర్మాణంలో పచ్చదనానికి పెద్దపీట వేసినట్లు వివరించారు. ఆ విశేషాలు మీకోసం.

Ayodhyas Ram Temple architect
Ayodhyas Ram Temple architect
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 4:42 PM IST

2,500 ఏళ్లు చెక్కుచెదరకుండా అయోధ్య రామాలయ నిర్మాణం

Ayodhya Ram Mandir Unique Features : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రామాలయం రూపుదిద్దుకోవడంలో ఆశీశ్​ సోంపురా అనే ఆర్కిటెక్ట్​ కీలక పాత్ర పోషించారు. వీరి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అయోధ్య రామమందిరం నిర్మాణంలో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 2500 ఏళ్లు మనుగడ సాగించేలా నిర్మాణం జరుగుతున్న ఈ రామాలయం గొప్పతనాన్ని సోంపురా వివరించారు.

"సాధారణంగా పురాతన కట్టడాలను 500 ఏళ్ల అనాలసిస్​తో నిర్మిస్తాం. కానీ ఈ ఆలయాన్ని 2500 ఏళ్ల దూరదృష్టితో నిర్మిస్తున్నాం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు గానీ భూకంపం కానీ వచ్చినా 2500 ఏళ్ల వరకు చెక్కుచెదరదు"
--ఆశీశ్​ సోంపురా, ఆర్కిటెక్ట్

అయోధ్య రామాలయాన్ని భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దుతున్నారు. భారతదేశంలో గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా తక్కువ అని ఆర్కిటెక్ట్ ఆశీశ్​ సోంపురా తెలిపారు. కానీ అయోధ్య రామాలయం గర్భగుడి ఆ ఆకారంలోనే ఉందని వెల్లడించారు. 'ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. అష్టభుజి ఆకారం విష్ణువుతో ముడిపడి ఉంది. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్​ చేశాం' అని ఆశీశ్​ సోంపురా వివరించారు

"ప్రస్తుతం ఆలయ సముదాయం మొత్తం 58 ఎకరాల్లో విస్తరించి ఉంది. ట్రస్ట్ మాత్రం ఈ విస్తీర్ణాన్ని 108 ఎకరాలకు విస్తరించాలని కోరుతోంది. కానీ అక్కడ మేము ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ ప్రదేశంలో పచ్చదనంపై దృష్టి పెడతాం. ఆలయ కాంప్లెక్స్ లోపల తక్కువ భవనాలు ఉంటాయి. మ్యూజియం, పరిశోధనా కేంద్రం, ప్రార్థన మందిరం మొదలైన ఇతర సౌకర్యాలను బయట ఉంచాలని మేము అనుకుంటున్నాం"
--ఆశీశ్​ సోంపురా, ఆర్కిటెక్ట్

ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35 నుంచి 40 వేల మంది ప్రయాణించే అవకాశం ఉంది. వృద్ధులు, అంగవైకల్యం ఉన్న భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయాన్ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభించనున్నారు.

అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్​తో నెక్లెస్​- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక!

అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు- ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.