ETV Bharat / bharat

'2024 ఎన్నికలకు ముందే అయోధ్య రాముని దర్శనం'

author img

By

Published : Oct 15, 2021, 5:01 PM IST

అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం సాధారణ ఎన్నికల (Lok Sabh Election 2024 ) కంటే ముందే పూర్తి కానుందని ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్​ 2023 నాటికి భక్తుల కోసం ఆలయ తలుపులు తెరుచుకుంటాయని ట్రస్ట్​ జనరల్​ సెక్రెటరీ చంపత్​ రాయ్​ పేర్కొన్నారు.

Ayodhya Ram Mandir
అయోధ్యలో రామ మందిర

2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabh Election 2024 ) కంటే ముందే ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్​ జనరల్​ సెక్రెటరీ చంపత్​ రాయ్​ ధీమా వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్​ నాటికి భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని అన్నారు. ఆలయ శంకుస్థాపన మొదటి దశ పనులు (Ram Mandir Construction) సెప్టెంబర్​ పూర్తి కాగా.. రెండో దశ పనులు మాత్రం నవంబర్​ 15 నాటికి పూర్తి అవుతాయన్నారు.

ayodya ramamandiram construction status
కాంక్రీట్ పనులు చేస్తున్న సిబ్బంది
ayodya ramamandiram construction status
రెండో దశ శంకుస్థాపన పనులు

ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇవి రాత్రి సమయాల్లో మాత్రమే చేస్తున్నారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 2023లోగా ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పించాం. అది పూర్తి అయితే భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.

- చంపత్​ రాయ్, రామజన్మభూమి తీర్థ‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతేడాది ప్రధాని నరేంద్రమోదీ.. ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.

ayodya ramamandiram construction status
అయోధ్య రామమందిర నిర్మాణ పనులు
ayodya ramamandiram construction status
అయోధ్య రామమందిర నిర్మాణ పనులు

ఇదీ చూడండి: మైసూర్​ ప్యాలెస్​లో దసరా సందడి.. జంబూసవారీకి సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.