Ayodhya Ram Mandir Statue Selection : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మితమవుతున్న భవ్యరామ మందిరం మరికొద్ది రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠ చేయనున్న రామయ్య విగ్రహం ఎలా ఉండనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా రాముడి విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలిసింది. గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇదివరకే ప్రకటించింది.
-
Pictures taken this morning at Shri Ram Janmabhoomi Mandir site.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
श्री राम जन्मभूमि मंदिर परिसर में आज प्रातः काल लिए गए चित्र pic.twitter.com/MOaDIiS91Y
">Pictures taken this morning at Shri Ram Janmabhoomi Mandir site.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 24, 2023
श्री राम जन्मभूमि मंदिर परिसर में आज प्रातः काल लिए गए चित्र pic.twitter.com/MOaDIiS91YPictures taken this morning at Shri Ram Janmabhoomi Mandir site.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 24, 2023
श्री राम जन्मभूमि मंदिर परिसर में आज प्रातः काल लिए गए चित्र pic.twitter.com/MOaDIiS91Y
35 అడుగుల దూరం నుంచే!
Ayodhya Ram Mandir Statue Height : ఆలయ గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలుడి రూపంలో అయోధ్య రామయ్య విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే రామ భక్తులు దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండే ఈ బాల రాముడికి సంబంధించి ముగ్గురు శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు.
దైవత్వం ఉట్టిపడే విగ్రహం ఎంపిక!
Ram Mandir Statue Sculpture : అయితే వాటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేయనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల వెల్లడించారు. దీనిపై శుక్రవారం సమావేశమైన కమిటీ ఒకదాన్ని ఎంపిక చేసినప్పటికీ మరింత మంది అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు ఇలా!
Ram Mandir Opening Ceremony : మరోవైపు, అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2024 జనవరి 16వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.
అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ హాజరు గురించి పార్టీ స్పందించింది. కాంగ్రెస్ నేతల హాజరుపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుని, ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం దిల్లీలో మీడియాకు వెల్లడించారు. సోనియాతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానాలు అందిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్‌రంజన్ చౌధురీకి కూడా అయోధ్య ఆహ్వానం అందింది. అయితే అధీర్‌రంజన్ చౌధురీతోపాటు సోనియా అయోధ్యకు రానున్నట్లు తెలుస్తోంది.
51 అంగుళాల విగ్రహం, 392 స్తంభాలు, లక్షల అడుగుల పాలరాయి- అంకెల్లో 'అయోధ్య అద్భుతాలు' ఇవిగో!
ఆధునిక వసతులు, ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ఎయిర్పోర్ట్- ఆలయంలా రైల్వే స్టేషన్!