Ayodhya Ram Mandir Construction Status : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా.. 45 రోజుల్లోగా మొత్తం పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 15వ తేదీలోగా గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలను ఎల్ అండ్ టీ రూపొందించిందని నిర్వాహకులు తెలిపారు.
![Ayodhya Ram Mandir Construction Status](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/up-ayo-03-mandir-nirman-update-visbyte-7211953_17112023164006_1711f_1700219406_334.jpg)
"2024 జనవరి 22వ తేదీన రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకు వీలైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విషయంలో పనులు త్వరగా పూర్తిచేయాలని ఎల్ అండ్ టీపై ఒత్తిడి ఉంది. గ్రౌండ్ ప్లోర్ పనులు చివరి దశలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. ప్రస్తుతం స్తంభాలపైన శిల్పకళాకృతులు చెక్కుతున్నారు. ఆలయంలోని నృత్య మండపం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రంగమండపాన్ని డిసెంబర్ నాటికల్లా నిర్మిస్తాం."
-- వినోద్ మెహతా, ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్
'పసిడి కాంతులతో మెరిసిపోనున్న ఆలయం'
ఆలయమంతా పసుపురంగు విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నట్లు ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా తెలిపారు. రెండు రకాల లైట్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వాల్వాస్ లైట్ల కాంతి నేరుగా.. స్తంభాలపై చెక్కిన శిల్పాలపై పడేటట్లు అమరుస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ పైకప్పుపై లైటింగ్ అమర్చడం పూర్తయిందని చెప్పారు. విద్యుత్ దీపాల అలంకరణ పనులన్నీ పూర్తయితే ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుందని పేర్కొన్నారు.
విగ్రహప్రతిష్టాపనకు 25వేల మంది అతిథులకు ఆహ్వానం!
Ayodhya Ram Mandir Opening Date : వచ్చే సంవత్సరం జనవరి 21 నుంచి 23 వరకు జరగనున్న రాముడి విగ్రహప్రతిష్టాపనకు శ్రీరామ జన్మభూమి ట్రస్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తం 25 వేల మందిని ఈ కార్యక్రమాలకు ఆహ్వనించనున్నట్లు ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే వారణాసి నుంచి అయోధ్యకు అర్చకులు వచ్చినట్లు తెలిసింది.
![Ayodhya Ram Mandir Construction Status](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-11-2023/up-ayo-03-mandir-nirman-update-visbyte-7211953_17112023164006_1711f_1700219406_543.jpg)
జనవరిలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ!.. హోటళ్లు, రిసార్ట్లు హౌస్‌ఫుల్..