ETV Bharat / bharat

బెడ్​ రాకెట్ గుట్టు రట్టు.. అందుబాటులో 3వేల పడకలు

కర్ణాటక బెంగళూరులో 3వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్​ చూపిస్తుంది. అయితే ఇటీవల సస్పెండ్​ అయిన కొవిడ్​ వార్​రూం సిబ్బంది అవకతవకల కారణంగా మంగళవారం వరకు వీటి సంఖ్య సున్నాగా ఉంది.

Bengaluru, beds
బెంగళూరు ఆసుపత్రుల్లో ఖాళీగా 3వేల పడకలు
author img

By

Published : May 5, 2021, 9:53 PM IST

Updated : May 5, 2021, 10:02 PM IST

కర్ణాటక బెంగళూరులో ఇటీవల బయటపడిన బెడ్​ రాకెట్ సంచలనం సృష్టించింది. నగరంలో ఏర్పాటు చేసిన వార్ రూంకు చెందిన సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై పడకల కృత్రిమ కొరత ఏర్పడేలా చేశారని ఆరోపణలు వచ్చాాయి. ప్రభుత్వం వెంటనే వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం నగరంలో మూడు వేలకు పైగా పడకలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్​ అయిన బీబీఎంపీలో 3,210 పడకలు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తోంది. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు వీటి సంఖ్య సున్నాగా ఉండడం గమనార్హం.

beds, bbmp
ఖాళీగా ఉన్న పడకల వివరాలు
beds, bbmp
ఖాళీగా ఉన్న పడకల వివరాలు

సిబ్బంది తొలగింపు..

బెంగళూరు సౌత్​జోన్​లో కరోనాకు సంబంధించి వార్ రూం​ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో కొవిడ్​ రోగులకు ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని ప్రభుత్వ అధికార వెబ్​సైట్​ అయిన బీబీఎంపీ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తుండాలి. అయితే వార్​ రూంలో పనిచేసే ఉద్యోగులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 17 మంది కాంట్రాక్టు సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది.

beds, bbmp
ఖాళీగా ఉన్న పడకల పట్టిక
beds, bbmp
ఖాళీగా ఉన్న పడకల వివరాలు

తీరిన పడకల కొరత..

ప్రస్తుతం బెంగళూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు వైద్యకళాశాలల్లో 1,693 పడకలు ఖాళీగా ఉన్నాయి. అంతేగాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్​ కేర్ సెంటర్లలో 1,517 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 10శాతం ఆక్సిజన్​తో కూడిన పడకలు ఉన్నాయి. వీటితో పాటు 127 ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రభుత్వ కోటా కింద 29 ఐసీయూ, 13 వెంటిలేటర్ పడకలు ఉన్నట్లు వెబ్​సైట్​ చూపిస్తోంది.

ఇదీ చూడండి: తల్లి చనిపోయినా.. తండ్రి కోసం తనయుడి ఆరాటం!

Last Updated : May 5, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.