ETV Bharat / bharat

స్టాక్ మార్కెట్​లో ఆటో డ్రైవర్ లాభాల రైడ్! డబ్బుల సంపాదనపై ప్రయాణికులకు టిప్స్ - ముంబయి ఆటో డ్రైవర్ విశాల్​ పైక్​రావ్​​ ప్యాకేజీ

Auto Driver Stock Market Trading : ఆటో డ్రైవింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్​- రెండూ ఏమాత్రం సంబంధం లేని విషయాలు. కానీ ఈ రెండింటినీ ఏకం చేసి దలాల్ స్ట్రీట్​లో దూసుకెళ్తున్నాడు ఓ ఆటో డ్రైవర్. బండి గేర్ మార్చినంత సులువుగా షేర్స్​ కొనేస్తూ, అమ్మేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు! ఆటో ఎక్కే ప్రయాణికులకు స్టాక్​ మార్కెట్​ ముచ్చట్లు చెబుతూ ఔరా అనిపిస్తున్నాడు.

Auto Driver Masters In Stock Market In Maharashtra Mumbai
Auto Driver Masters In Stock Market
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 8:21 PM IST

స్టాక్ మార్కెట్​లో ఆటో డ్రైవర్ లాభాల రైడ్!

Auto Driver Stock Market Trading : ముంబయికి చెందిన 24 ఏళ్ల విశాల్​ పైక్​రావ్​ ఆటో నడుపుతూనే స్టాక్​ మార్కెట్​లో ట్రేడింగ్ చేస్తున్నాడు. ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేసేందుకు 2019లో కొరియర్​ సంస్థలో ఉద్యోగం మానేశాడు విశాల్. అయితే, మరో ఆదాయ మార్గం కూడా ఉండాలన్న ఆలోచనతో ఆటో డ్రైవర్​గా మారాడు.

యూట్యూబ్ పాఠాలు- చిన్న మొత్తంలో పెట్టుబడి
'నేను ఎప్పటినుంచో ట్రేడింగ్ చేస్తున్నా. ఉద్యోగం చేసేటప్పుడు ట్రేడింగ్​కు సరిపడా సమయం ఉండేది కాదు. ఫుల్ టైమ్ ట్రేడింగ్​ మొదలుపెట్టాక నాకు మరో ఆదాయ మార్గం కూడా ఉండాలని అర్థమైంది. ట్రేడింగ్ మొదలుపెట్టాక తొలి మూడేళ్లు భారీ లాభాలు ఆశించకూడదు. బతికేందుకు మరో ఆదాయం కూడా ఉండాలి. అందుకే ఆటో నడుపుతున్నా' అని చెప్పాడు విశాల్​. ఇక యూట్యూబ్​ వీడియోలు చూసి, చిన్నమొత్తంలో పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ నేర్చుకున్నానని అతడు తెలిపాడు.

"2019లో స్టాక్​ మార్కెట్​ గురించి తెలుసుకున్నా. భారీగా డబ్బు సంపాదించేందుకు స్టాక్​ మార్కెట్ ఓ మార్గం అని అర్థం చేసుకున్నా. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో, షేర్స్ ఎలా కొనాలో నేర్చుకున్నా. అలా ట్రేడింగ్​ గురించి మొత్తం తెలుసుకున్నా. చాలా మందికి అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు. వాళ్లు తమ గమ్యస్థానాలకు చేరితే చాలని అనుకుంటారు. ఆటోలోని చార్ట్స్​ చూసినా పెద్దగా పట్టించుకోరు. ట్రేడింగ్ గురించి తెలిసిన కొందరు మాత్రం ఇవి ఎందుకు పెట్టావని అడుగుతారు. నేను ఆటోలోనే ట్రేడింగ్ చేస్తానని చెబుతాను. వారు షాక్ అవుతారు. అన్ని వివరాలు అడుగుతారు. ఇన్నేళ్లుగా నేను నేర్చుకున్నవన్నీ వారికి చెబుతాను."
- విశాల్​ పైక్​రావ్​, ఆటో డ్రైవర్

ఆటోలో ఎక్కే ప్రయాణికులకు ట్రేడింగ్ టిప్స్!
ఇప్పటివరకు గడించిన అనుభవంతో స్టాక్​మార్కెట్​ నిపుణుడు అయ్యాడు విశాల్! తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులతో షేర్స్ గురించి చర్చిస్తుంటాడు. ఆటో నడపడం- ఎంతో మందిని కలిసేందుకు, వారి కథలు వినేందుకు తనకు అవకాశం కల్పిస్తోందని అంటున్నాడు విశాల్. ఇలానే డ్రైవర్​ వృత్తిని కొనసాగిస్తానని చెబుతున్నాడు.

చుట్టూ వరద- భయంతో 39 గంటలు చెట్టుపైనే వృద్ధుడు

వంశదేవతలుగా గుండ్రటి రాళ్లకు పూజలు!- చివరకు డైనోసార్​ గుడ్లుగా గుర్తింపు- ఎక్కడో తెలుసా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.