ETV Bharat / bharat

ఆటో ఛార్జీ ఇవ్వలేదని.. బాలికపై డ్రైవర్​ అత్యాచారం - Auto driver raped a minor in maharashtra

Auto driver rapes Nepalese girl: ఆటో ఛార్జీ చెల్లించలేని మైనర్​పై డ్రైవర్​ అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. అదే బాలికపై అత్యాచార ఘటనకు 15 రోజుల ముందు మరో ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.

Auto driver rapes a Nepalese girl
Auto driver rapes a Nepalese girl
author img

By

Published : Jan 8, 2022, 1:11 PM IST

Auto driver rapes Nepalese girl: నేపాలీ మైనర్​పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆటోడ్రైవర్ సహా మరో ఇద్దరిని మహారాష్ట్రలోని పుణె పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

"బాధితురాలు ఉద్యోగం కోసం నేపాల్​ నుంచి భారత్​కు వచ్చింది. ఉపాధి కోసం అన్వేషించి అలసిపోయిన బాలిక తాను ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు హడప్‌సర్​ ప్రాంతంలో ఆటో ఎక్కింది. క్షేమంగా గమ్యం చేరుకుంది. అయితే డబ్బులు లేక ఆటో ఛార్జీ చెల్లించలేకపోయింది. దీంతో ఆ ఆటోడ్రైవర్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్​ను అరెస్ట్​ చేశాం" అని హడప్​సర్​ పోలీసులు తెలిపారు.

15 రోజుల ముందు..

అదే బాధితురాలిపై అత్యాచార ఘటనకు 15 రోజుల ముందు ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

మైనర్​ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నెల 11 వరకు నిందితులను పోలీసు కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: 'ఫేమస్ కావాలనే 'బుల్లీ బాయ్' యాప్​లో మహిళల వేలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.