Auto Driver English: కర్ణాటక, బెంగళూరుకు చెందిన 74 ఏళ్ల ఓ ఆటోడ్రైవర్ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ భాషపై ఆయనకు ఉన్న పట్టుకు మీరు ఫిదా అవ్వాల్సిందే.. అవును బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని నికితా అయ్యర్ పోస్ట్ ద్వారా ఆటో డ్రైవర్ పట్టాభి రామన్(74) ప్రపంచానికి పరిచయం అయ్యారు. పట్టాభి ఆటోలో దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణించిన నికితా.. ఆయన ఇంగ్లీష్ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఈ వివరాలను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఏమైందంటే..?
నికితా అయ్యర్.. ఆఫీస్‌కు వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుపై ఎదురుచూస్తుండగా.. పట్టాభి రామన్ వచ్చి ఇంగ్లీష్‌లో మాట్లాడారు. పట్టాభి ఆంగ్ల నైపుణ్యానికి ఆశ్చర్యానికి గురయ్యారు నికితా. 45 నిమిషాల ఆటో ప్రయాణంలో ఇద్దరూ ఆంగ్లంలోనే మాట్లాడుకున్నారు. మీరు ఇంత స్పష్టంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? అని నికితా అడగ్గా.. పూర్వం తాను ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేశానికి చెప్పుకొచ్చారు పట్టాభి. ఆ తర్వాత ఇరువురి మధ్య జరిగిన సంభాషణను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు నికితా.
ఇదీ చూడండి: బాయ్‌ఫ్రెండ్ కళ్ల ముందే యువతిపై గ్యాంగ్‌రేప్