మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘతి ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 155 కిలోల బరువున్న గర్భిణీకి సురక్షితంగా ప్రసవాన్ని చేశారు. అధిక రక్తపోటు, డయాబెటీస్, కడుపు నొప్పితో బాధపడుతున్న గర్భిణీ వైద్యం కోసం కొన్ని రోజుల క్రితం ఘతి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యుడు విజయ్ కల్యాంకర్ ఆధ్వర్యంలో వైద్యబృందం విజయవంతంగా ప్రసవాన్ని చేసింది.
బిఎంఐ 66 దాటిన గర్భిణీలకు ఇప్పటివరకు ప్రపంచంలో 6 మందికే విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయిందని.. ఇది ఏడోదని ఘతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇలా అరుదైన ఘనత సాధించటం పట్ల వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:అడవితల్లి రక్షణలో గుజరాత్ మహిళలు.. అన్నీ వారై..!