ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యేపై దాడి.. కారు ధ్వంసం - ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ఎమ్మెల్యేపై దాడి

ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ఎమ్మెల్యేపై దాడి జరిగింది. సిసౌలీ గ్రామంలో నిరసనకారులు ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టి కారును ధ్వంసం చేశారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే.. స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

attacked on BJP MLA car in Muzaffarnagar
ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా ఎమ్మెల్యేపై దాడి
author img

By

Published : Aug 14, 2021, 8:03 PM IST

Updated : Aug 14, 2021, 9:11 PM IST

రాకేశ్​ టికాయిత్​ గ్రామంలో భాజపా ఎమ్మెల్యేపై దాడి

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ జిల్లా సిసౌలీ గ్రామంలో భాజపా ఎమ్మెల్యే ఉమేశ్​ మాలిక్​పై దాడి జరిగింది. పదుల సంఖ్యలో నిరసనకారులు ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టారు. కారుపై సిరా చల్లి, రాళ్లతో వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం రైతు నేత రాకేశ్​ టికాయిత్​ స్వగ్రామం కావడం గమనార్హం.

attacked on BJP MLA car in Muzaffarnagar
భాజపా ఎమ్మెల్యేపై దాడి

కారుపై సిరా చల్లిన నిరసనకారులు

సిసౌలీలోని జనకల్యాణ్​ సమితి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేను నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే, అతని బృందం అక్కడి నుంచి తప్పించుకుని.. ఈ ఘటనపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు బీకేయూ నేతలని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి : విదేశీ జంటను భారత రాజ్యాంగం కలిపిందిలా!

Last Updated : Aug 14, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.