ETV Bharat / bharat

సీఎం ఇంటిపై దాడి.. బారికేడ్లు, సీసీ కెమెరాలు ధ్వంసం.. వారి పనే! - కేజ్రీవాల్ ఇంటిపై దాడి

Attack On Kejriwal House: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి బయట ఉన్న బారికేడ్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దాదాపు 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

attack on delhi cm arvind kejriwal house
దిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఇంటిపై దాడి.. 70మంది అరెస్ట్​..
author img

By

Published : Mar 30, 2022, 5:22 PM IST

Updated : Mar 30, 2022, 6:11 PM IST

సీఎం ఇంటిపై దాడి

Attack On Kejriwal House: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి జరిగింది. ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై కేజ్రీవాల్​ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు భాజపా కార్యకర్తలు. భాజపా ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. దిల్లీ సివిల్ లైన్స్​లోని సీఎం ఇంటి బయట బారికేడ్లను తొలగించి ఆందోళనలు చేపట్టారు భాజపా కార్యకర్తలు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

attack on delhi cm arvind kejriwal house
దిల్లీ సీఎం ఇంటివైపు దూసుకొస్తున్న కార్యకర్తలు

కేజ్రీవాల్ ఇంటి బయట ధర్నాకు దిగిన భాజపా కార్యకర్తలు

ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసులు

'కేజ్రీవాల్​ను టచ్ చేస్తే..': ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. పంజాబ్​లో ఆప్ ఘనవిజయం సాధించడం భాజపా జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్​పై హత్యాయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్​ను టచ్​ చేయాలని చూస్తే.. దేశం సహించదని సిసోడియా హెచ్చరించారు.

ఇదీ చూడండి: మహిళ ఫోన్​ కొట్టేసి చెట్టెక్కిన కోతి.. కాల్ రాగానే ఆన్సర్​ చేసి...

Last Updated : Mar 30, 2022, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.