అవినీతి నిరోధక శాఖ అధికారులపై పోలీసులు దాడి (Attack on Police today) చేసిన ఘటన ఝార్ఖండ్‌లోని గఢ్వా ప్రాంతంలో (Garhwa Jharkhand news) జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లాలోని రంకా స్టేషన్‌కు (Ranka Garhwa news) చెందిన ఓ పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు వెళ్లగా.. ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఏసీబీ ఇన్స్పెక్టర్ అజిత్ ఎక్కా సహా ఇద్దరు గాయపడ్డారు.
![police attack on acb team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jh-gar-01-acb-pr-hmla-vis-vis-jh10095_27102021210101_2710f_1635348661_1067.jpg)
పోలీసులు, ఏసీబీ బృందం మధ్య ఘర్షణతో పోలీస్ స్టేషన్ రణరంగాన్ని తలపించింది.
సెటిల్మెంట్ కోసం రూ.20 వేలు!
రంకా స్టేషన్లో పనిచేస్తున్న కమలేశ్ సింగ్ అనే పోలీసుపై పాలము ఏసీబీ కార్యాలయంలో కేసు నమోదైంది. లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలతో ఈ ఫిర్యాదు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణలో భాగంగా రంకా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు ఏసీబీ అధికారులు. భూతగాదాను సెటిల్ చేసేందుకు ఓ వాచ్‌మన్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దీంతో కమలేశ్ సింగ్ రచ్చ రచ్చ చేశాడు. పోలీసులను రెచ్చగొట్టి ఏసీబీ అధికారుల మీదకు ఉసిగొల్పాడు. స్టేషన్‌లోని పోలీసులు ఏసీబీ బృందంపై దాడి (Attack on Police today) చేశారు. ఈ క్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ అజిత్ ఎక్కాకు గాయాలయ్యాయి.
సీనియర్ అధికారులకు సమాచారం అందించిన ఏసీబీ అధికారులు.. పోలీస్ స్టేషన్లోనే బైఠాయించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి పరారీలో ఉన్నాడు.
గఢ్వా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అవధ్ కుమార్ యాదవ్.. రంకా పోలీస్ స్టేషన్‌కు హుటాహుటిన వెళ్లారు. వివరాలన్నీ సేకరించి.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: ట్రాన్స్ఉమన్తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా...