ETV Bharat / bharat

ఏటీఎంలో నగదు పెడుతుండగా కాల్పులు.. గార్డు​ మృతి.. రూ.20లక్షలతో పరార్​ - జబల్​పుర్​ ఏటీఎం చోరీ

ATM Robbery: మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో శుక్రవారం మధ్యాహ్నం ఓ బ్యాంక్​​ ఏటీఎం వద్ద దొంగతనం జరిగింది. దుండగుడు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదును కాజేశాడు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు.

jabalpur atm guard
ఏటీఎంలో చోరీ
author img

By

Published : Feb 12, 2022, 7:17 AM IST

Updated : Feb 12, 2022, 7:47 AM IST

ATM Robbery: ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి దాదాపు రూ.20 లక్షలు దోచుకెళ్లాడు ఓ దుండగుడు. ఈ కాల్పుల్లో ఆ ఏటీఎం సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

డబ్బులు నింపుదామని వస్తే..

సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిల్హరీ ప్రాంతంలో ఉన్న బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సిబ్బంది వచ్చారు. వాళ్లు ఆ ఏటీఎంలోకి ప్రవేశించగానే అక్కడే ఉన్న నిందితుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు రాజ్​ బహదూర్​ పటేల్​ (46) ప్రాణాలు కోల్పోగా.. అభిలాష్​ యాదవ్, రాజ్​ సింగ్​లు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నగదు తీసుకుని నిందితుడు మరొవ్యక్తి సాయంతో పరారయ్యాడు.

నిందితుడు ఐదు నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడని.. దాదాపు రూ.20 లక్షలు ఉన్న క్యాష్​ బాక్స్​ను ఎత్తుకెళ్లాడని అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫూటేజ్​ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ప్రేమించడమే పాపం... యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి..

Last Updated : Feb 12, 2022, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.