ETV Bharat / bharat

బైక్ నుంచి బస్సు వరకు రయ్​రయ్​.. అథిరా స్టీరింగ్ పడితే..

అమ్మాయిలు కారు​ నడపడం సాధారణమైన విషయమే. కానీ స్పోర్ట్స్​ కార్లు నడపడమంటే గొప్ప విషయం. అంతేగాక టిప్పర్​ లారీలు, టూరిస్టు బస్సులు వంటి అతి భారీ వాహనాలను మహిళలు డ్రైవ్ చేయడమనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఇక కార్​ రేసింగ్​లలోనూ పాల్గొంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు కేరళకు చెందిన ఓ యువతి. ఆమె విజయప్రస్థానం గురించి ఓ సారి తెలుసుకుందాం.

athira murali vlogger
అథిరా మురళి
author img

By

Published : Mar 10, 2023, 7:46 PM IST

బైక్ నుంచి బస్సు వరకు రయ్​రయ్​.. అథిరా స్టీరింగ్ పడితే..

ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. కూలీ పనుల మొదలుకొని విమానాలు నడిపే పైలట్​ వరకు అన్ని ఉద్యోగాల్లో రాణిస్తున్నారు నేటి మహిళలు. అయితే పురుషులు మాత్రమే ఎక్కువగా ఆసక్తి చూపే డ్రైవింగ్​, కారు​ రేసింగ్​లలో తనదైన ప్రతిభతో దూసుకుపోతున్నారు కేరళకు చెందిన 29 ఏళ్ల అథిరా మురళి.

కొట్టాయం జిల్లా లక్కట్టూర్​ గ్రామానికి చెందిన మురళి, ఉషా దంపతుల కుమార్తె అథిరా మురళి. ప్రస్తుతం ఆమె అన్ని రకాల వాహనాలను నడుపుతూ​ దూసుకుపోతున్నారు. తనకు 18 ఏళ్ల వయసు రాగానే టూ వీలర్​, త్రీ వీలర్, ఫోర్​ వీలర్​ వాహనాలను నేర్చుకుని లైసెన్స్ కూడా సంపాదించారు. 20 ఏళ్లకే భారీ వాహనాలైన ట్రాక్ట్రర్​, జేసీబీ వంటి భారీ వాహనాలను సైతం నేర్చుకుని ఔరా అనిపిస్తున్నారు.

వాహనాల డ్రైవింగ్​పై అథిరాకు ఉన్న ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి మురళి ప్రోత్సాహించి డ్రైవింగ్​లో శిక్షణ ఇప్పించారు. తన తండ్రి మోటార్​ సైకిల్​పై మొదలైన అథిరా డ్రైవింగ్​ శిక్షణ.. ప్రస్తుతం జీపులు, కార్లు వంటి అన్ని రకాల వాహనాలను నడిపే స్థాయికి చేరుకున్నారు. ద్విచక్రవాహనం దగ్గర నుంచి అతి భారీ వాహనాలైన టిప్పర్​ లారీ, టూరిస్ట్​ బస్సు, జేసీబీలను అలవోకగా నడపగలుగుతున్నారు అథిరా.

athira murali vlogger
బస్సు నడుపుతున్న అథిరా మురళి

డ్రైవింగ్​లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన అథిరా.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకున్నారు. అలాగే యూనివర్సల్​ రికార్డ్స్ ​ ఫోరమ్​ అందించే అవార్డును గెలుపొందారు. మరోవైపు వాహనాలపై మక్కువతో ఆటో వ్లాగర్​గానూ మారారు అథిరా. మార్కెట్లో నూతనంగా లాంఛ్​ అయ్యే వాహనాల కొత్త మోడల్స్​ల ఫీచర్లు, ఇతర వివరాలను నెటిజన్లకు క్లుప్తంగా వివరిస్తూ వాటి వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు అథిరా. దీంతో ఆటోమొబైల్స్​ జర్నలిస్టుగా కూడా అథిరా ప్రత్యేక గుర్తింపు పొందారు. అథిరాకు ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​, యూట్యూబ్​లలో కలిపి సుమారు 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

athira murali vlogger
జేసీబీను నడుపుతున్న అథిరా మురళి

"నాకు చిన్నప్పటి నుంచి కార్లంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలోనే లారీ, జేసీబీ వంటి భారీ వాహనాలను నడపడం నేర్చుకున్నాను. ఆ తర్వాత రేసింగ్, ర్యాలీ, ఆఫ్ రోడ్ బైక్ రైడింగ్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాను. ఆ సమయంలో నాకొక ఆలోచన వచ్చింది. అదే ఆటో వ్లాగింగ్​.దేవుడి దయతో నా వ్లాగింగ్​ వీడియోలను ప్రజలు ఆదరిస్తున్నారు. మహిళ అయినందు వల్ల ఇంటికే పరిమితం కావాలని లేదు. మీకు ఏది ఇష్టమో అదే చేసేందుకు ప్రయత్నం చేయండి. కచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇదే నా సంతోషానికి, విజయానికి కారణం. అందుకు మహిళలకు కావల్సింది ఎవరి మీద ఆధార పడుకుండా ఉండడమే. అందుకే మహిళలు ఉద్యోగం సంపాదించాలి. మహిళలందరూ డ్రైవింగ్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ రోల్ మోడల్‌గా నిలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది."

--అథిరా మురళి, ఆటోమొబైల్ జర్నలిస్ట్

2014 నుంచి 2018 మధ్య కాలంలో అథిరా రేసింగ్​ నేర్చుకోవడంపై దృష్టి సారించారు. కార్ల రేసింగ్​లో మెళుకువలు నేర్చుకున్నారు. దీంతో 2019లో ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ డ్రైవర్ కోసం ప్రారంభించిన శిక్షణను 2020లో విజయవంతంగా పూర్తిచేశారు. ఇప్పటివరకు మహీంద్ర ఆఫ్ రోడ్ రేస్, ఆటో క్రాస్ కార్ రేస్​ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఇక ప్రస్తుతం మోటార్​ స్పోర్ట్స్​ ఈవెంట్లు, ఆటోమొబైల్స్​ రివ్యూలపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని చెబుతున్నారు అతిరా.

athira murali vlogger
కారు నడుపుతున్న అథిరా మురళి

ఇక ఆటో వ్లాగర్‌గా పేరు తెచ్చుకున్న అథిరా బీసీఏలో పట్టా పొందారు. ఆటో మొబైల్స్​పై ఉన్న ఆసక్తితో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కూడా పూర్తి చేశారు. మహిళలందరూ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెబుతున్నారు అథిరా. దేశమంతా పర్యటించి భిన్న సంస్కృతులను తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అథిరా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.