ETV Bharat / bharat

'జంగిల్​ మే సవాల్'.. బ్రిటిష్​ను బెంబేలెత్తించిన గిరిజన పోరాటం - asirgarh ka kila

'బస్తీమే సవాల్' అనలేదు. వాళ్లు 'జంగిల్ మే సవాల్' అన్నారు. బ్రిటిష్ పాలకుల దుష్పరిపాలన(british rule in india)కు ఎదురు నిలిచారు. తెల్లదొరల పెత్తనానికి దేశమంతా దాసోహమన్నప్పటికీ .. ఛత్తీస్​గఢ్‌, పశ్చిమ ఒడిషాలోని ఓ గిరిజన ప్రాంతం ఎదురు నిలిచి పోరాడింది. ఓ సంస్థానాధీశుడు, ఓ జమీందారు ఆంగ్లేయులను ఏళ్లపాటు గడగడలాడించారు. స్వాతంత్ర్య కాంక్షను ఒదులుకునేది లేదంటూ తుదిశ్వాస దాకా పోరాడారు.

Rajas and Zamindars gave tough fight to Britishers
బ్రిటిష్​పై గిరిజన పోరాటం
author img

By

Published : Sep 5, 2021, 6:25 AM IST

'జంగిల్​ మే సవాల్'

మనదేశాన్ని దాదాపు రెండు శతాబ్దాలు తెల్లదొరలు(british rule in india) పరిపాలించారు. దురాగతాలకు, అణచివేతకు పాల్పడుతూ దుష్టపాలన కొనసాగించారు. అయితే వలస పాలకులు 1857 ప్రథమస్వాతంత్ర్య సంగ్రామం(1857 revolt) నుంచి దాదాపు అన్ని తిరుగుబాట్లను అణచివేశారు. కానీ వాళ్లని ఎదిరించి వీరోచితంగా పోరాడిన గిరిజన ప్రాంతమూ ఉంది. అదే అఠారాహ్‌గఢ్‌.

బ్రిటిష్ పాలన వ్యతిరేక పోరాటంలో పృథ్వీరాజ్‌ చౌహాన్ వారసులు ముందు నిలిచారు. సంబల్ పూర్ రాజా సురేంద్ర సాయి, సోనాఖన్ జమీందార్ వీర్‌ నారాయణ్ సింగ్ తదితరులు. ఈ జమీందార్లలో కొందరు గోండులు ఉండగా, అనేకులు బింజ్వార్​లు. సారవంతమైన భూమిగా పేరున్న అఠారాహ్‌గఢ్‌(Atharahagadh)లో అటవీ ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం. పద్దెనిమిదో శతాబ్దపు అఠారాహ్‌గఢ్‌లో నేటి తూర్పు ఛత్తీస్​గఢ్‌, పశ్చిమ ఒడిషా(independence revolt odisha) ప్రాంతాలున్నాయి.

ఎన్నో ప్రయత్నాలు..

దేశంలో రాజులు, జమీందార్లు స్వయంపాలన(zamindar ruler) కోసం పోరాడుతున్న వేళ.. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం(battle of plassey) బెంగాల్​పై బ్రిటిష్ వారికి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. 1818 నాటికి వలసపాలకులు మనదేశంలో ఒక్క అఠారాహ్‌గఢ్‌ మినహా దాదాపు అన్ని భూభాగాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అఠారాహ్‌గఢ్‌ స్వాధీనానికి వలస పాలకులు చేయని ప్రయత్నం లేదు. సంబల్ పూర్ సింహాసనంపై(sambalpur rulers) దివంగత రాజా మహారాజ్‌ సాయి సతీమణి రాణిమోహన్​ను కూర్చోబెట్టారు.ఈ చర్యను అఠారాహ్‌గఢ్‌ రాజులు, భూస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ కారణంతో సురేంద్రసాయి, సోదరుడు ఉదంత సింగ్, మామగారు బలరామ్ సింగ్​లను అరెస్టు చేసి హజారీబాగ్ జైలులో ఉంచారు.

ఆగని తిరుగుబాటు

సురేంద్రసాయి, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన తర్వాత కూడా తిరుగుబాటు కొనసాగింది. సోనాఖన్​కు చెందిన బింజ్వార్ జమీందార్ నారాయణ్‌ సింగ్‌ తిరుగుబాటులో ముందున్నారు. 1856లో ఈ ప్రాంతంలో తీవ్ర కరువు కాటకాలు విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో ఆయన గోదాము తాళాలు పగులగొట్టి ధాన్యాన్ని గ్రామీణ ప్రజలకు పంచిపెట్టారు. ఆ సమయంలో ఆయన్ని నిర్బంధంలోకి తీసుకుని రాయపూర్ జైల్లో ఉంచారు. కానీ కొద్ది రోజులకే జైలు అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. 1857 జూలై 30 న భారత సైనికులు హజారీ బాగ్ జైలు తాళాలు బద్దలు కొట్టారు. సురేంద్రసాయి, ఆయన అనుచరులు తప్పించుకొనేందుకు మార్గం చూపారు. తప్పించుకున్న తర్వాత సురేంద్రసాయి తదితరులు సారంగఢ్‌ రాజు రాజా సంగ్రామ్ సింగ్ దగ్గర ఆశ్రయం పొందారు.

తెల్లవాడి ఎత్తుగడ

సురేంద్రసాయిని అరెస్టు చేయటంలో విఫలమైన బ్రిటిషర్లు ఓ దౌత్యపరమైన ఎత్తుగడ వేశారు. 1861లో తెలివిగా సంబల్ పూర్, కటక్ జైళ్లలో ఉన్న తిరుగుబాటుదార్లను విడుదల చేశారు. సురేంద్ర సాయి లొంగిపోయాడే 1862 నవంబర్ 22న బ్రిటిష్ గవర్నక్ జనరల్‌ ఎల్జిన్... లండన్ లోని బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్​కు తెలియపర్చాడు. ఈ చర్య తర్వాత అఠారాహ్‌గఢ్‌ రాజు, జమీందార్లు బ్రిటిషర్లు తమ వాగ్దానాలను నెరవేరుస్తారని ఆశతో ఎదురు చూశారు. ఆంగ్లేయులు వాగ్దానాలు మరచిపోయారు. అంతే కాదు ఇక్కడ పరిపసాలనా వ్యవస్థనే మార్చివేశారు. కానీ తమకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ సురేంద్రసాయి మ రో పర్యాయ సాయుధ తిరుగుబాటుకు సమాయత్తమయ్యారు. తిరుగుబాటు కదలికలను ముందుగానే పసిగట్టిన ఆంగ్లేయ పాలకులు సురేంద్రసాయిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా దగ్గర 'అసీర్ గఢ్‌' కోట(asirgarh ka kila)లో 17 ఏళ్లు బందీగా ఉంచారు. బందీగా ఉంటూనే ఆయన మృతిచెందారు.

ఆయనకు మరణశిక్ష

సురేంద్రసాయి కథముంగించినట్లే సోనాఖన్ భూస్వామి వీర్‌ నారాయణ సింగ్ అరెస్టుకు వలసపాలకులు ఎత్తుగడలు వేశారు. ఆయన ఆచూకీకోసం గ్రామీణులను వేధించసాగారు. తానెంతో ప్రేమించిన తనవాళ్లపై అఘాయిత్యాలు చూసి వీర్ నారాయణ సింగ్ లొంగిపోయాడు. 1857 డిసెంబర్ 5వ తేదీన వీర్ నారాయణ సింగ్​ను రాయపూర్ లోని డిప్యూటి కమిషనర్ ఇలియట్​కు అప్పగించారు. రాయపూర్​లో ఆయనకు మరణశిక్ష విధించారు.

స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తి

తెల్లదొరతనం మీద అవిశ్రాంతంగా పోరాడి, కుటిల ఎత్తుగడలకు మోసపోయిన... ఈ వీరోచిత కథానాయకుల కథలు నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. సురేంద్రసాయి, వీర్ నారాయణ్‌ సింగ్‌ వీరగాధలు చరిత్రపుటల్లోకి చేరి కనుమరుగై పోయి ఉండవచ్చు.. కానీ స్వాతంత్ర్య కాంక్షను తేలిగ్గా ఒదులుకోబోమన్న వారి సందేశం స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.