ETV Bharat / bharat

అసోంలో కాంగ్రెస్​ ప్రచారం- రంగంలోకి ప్రియాంక - అసోంలో ప్రియాంక గాంధీ

అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు కాంగ్రెస్​ శ్రీకారం చుట్టనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు కాంగ్రెస్​ ప్రచార శంఖారావం పూరించనున్నారు. రెండు రోజుల పాటు ఆమె రాష్ట్రంలో పర్యటిస్తారు.

Assembly polls
అసోంలో కాంగ్రెస్​ ప్రచారం- రంగంలోకి ప్రియాంక
author img

By

Published : Mar 1, 2021, 5:30 AM IST

నేటి నుంచి అసోంలో కాంగ్రెస్​ ప్రచారం మొదలుపెట్టనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను రంగంలోకి దింపింది. మార్చి 1 నుంచి రెండు రోజుల పాటు ఆమె రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు.

వీలైనంత ఎక్కువగా ప్రియాంకతో ప్రచారం చేయించాలని పార్టీ నిర్ణయించింది. నేడు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్చి 2న తేజ్​పుర్​లో ఓ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

అసోంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే కేరళలో ప్రియాంక ప్రచారానికి సంబంధించిన తేదీలను పార్టీ రాష్ట్ర బాధ్యులకు అందించారు.

ఇటీవల కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో పర్యటించారు. ఏది ఏమైనా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను మాత్రం రాష్ట్రంలో అమలు కానివ్వబోమని ప్రకటించారు.

అసోం

  • స్థానాలు:- 126
  • పోలింగ్​ తేదీలు:- మార్చి 27, ఏప్రిల్​ 2, ఏప్రిల్​ 6(మొత్తం 3 దశలు)
  • ఫలితాలు:- మే 2

ఇదీ చూడండి: 'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.