ETV Bharat / bharat

5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్​ - అధికార పీఠం ఎవరిదంటే? - Cvoter Exit Poll 2023

Assembly Elections Exit Poll Results 2023 LIVE In Telugu : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల.. ఎగ్జిట్​ పోల్స్​ వచ్చేశాయి. తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​ల్లో భాజపా అధికారం కైవసం చేసుకోవచ్చని పేర్కొన్నాయి. ఇక మిజోరంలో స్థానిక పార్టీల మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని చెబుతున్నాయి.

Telangana Assembly Elections Exit Poll Results 2023
Assembly Elections Exit Poll Results 2023 LIVE
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 8:43 PM IST

Updated : Nov 30, 2023, 10:51 PM IST

Assembly Elections Exit Poll Results 2023 LIVE : దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్​పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా ఎగ్జిట్ పోల్స్​ తెలంగాణా, ఛత్తీస్​గఢ్​లలో కాంగ్రెస్​ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​ల్లో భాజపా అధికార పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

మిజోరం విషయానికి వస్తే.. జోరామ్ పీపుల్స్​ మూవ్​మెంట్​ (ZPM), మిజో నేషనల్​ ఫ్రంట్​ (MNF) మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని స్పష్టం చేశాయి.

ప్రస్తుతానికి...
ప్రస్తుతానికి మధ్యప్రదేశ్​లో భాజపా; ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​ల్లో కాంగ్రెస్​; తెలంగాణలో కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నాయి. మిజోరంలో MNF పార్టీ అధికారంలో ఉంది. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు నవంబర్ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కానీ, తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్​లో మళ్లీ బీజేపీకే పట్టం!
Madhya Pradesh Election Exit Poll Results 2023 : మధ్యప్రదేశ్​లో మళ్లీ బీజేపీకే అధికారం రావచ్చని మెజారిటీ ఎగ్జిట్​పోల్స్ అంచనా వేస్తున్నాయి. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ అధికారం దక్కించుకోవచ్చని అంటున్నాయి. అంటే మధ్యప్రదేశ్​లో అధికార బీజేపీ, కాంగ్రెస్​ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్​ ఏమి చెబుతున్నాయంటే..

MP EXIT POLLS 2023
టుడేస్ చాణక్య ఎగ్జిట్​ పోల్స్​
MP EXIT POLLS 2023
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్​ పోల్స్​
MP EXIT POLLS 2023
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్​
MP EXIT POLLS 2023
జన్​కీబాత్​ ఎగ్జిట్ పోల్స్​
MP EXIT POLLS 2023
యాక్సిస్​ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్​
MP EXIT POLLS 2023
ఇండియా టీవీ-సీఎన్​ఎక్స్​ ఎగ్జిట్ పోల్స్​
MP EXIT POLLS 2023
టైమ్స్​నౌ ఎగ్జిట్ పోల్స్​
MP EXIT POLLS 2023
టీవీ9-భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్​
MP EXIT POLLS 2023
పీపుల్స్​ పల్స్ ఎగ్జిట్ పోల్స్​

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్​

పార్టీగెలిచే స్థానాలు
కాంగ్రెస్​80
బీజేపీ138
ఇతరులు12

సీ ఓటర్​ ఎగ్జిట్ పోల్స్​

పార్టీ గెలిచే స్థానాలు
కాంగ్రెస్​92
బీజేపీ128
ఇతరులు10

CSDS ఎగ్జిట్ పోల్స్​

పార్టీగెలిచే స్థానాలు
కాంగ్రెస్​72
బీజేపీ141
ఇతరులు17

ఏబీపీ-నీల్సన్​ ఎగ్జిట్​ పోల్స్​

పార్టీగెలిచే స్థానాలు
కాంగ్రెస్​80
బీజేపీ138
ఇతరులు12

రాజస్థాన్​లో కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ!
Rajasthan Election Exit Poll Results 2023 : రాజస్థాన్​లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అంటే రాజస్థాన్​లో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఈసారి కూడా అధికార మార్పిడి జరగవచ్చని పేర్కొన్నాయి. ముఖ్యంగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్​ బీజేపీకే అధికారం రానుందని వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే..

Rajasthan Exit Polls 2023
టీవీ9- భారత్​వర్ష్ ​ ఎగ్జిట్​ పోల్స్​
Rajasthan Exit Polls 2023
యాక్సిస్​ మై ఇండియా ​ ఎగ్జిట్​ పోల్స్​
Rajasthan Exit Polls 2023
జన్​కీబాత్ ​ ఎగ్జిట్​ పోల్స్​
Rajasthan Exit Polls 2023
రిపబ్లిక్ టీవీ ​ ఎగ్జిట్​ పోల్స్​
Rajasthan Exit Polls 2023
పీపుల్​ పల్స్ ఎగ్జిట్​ పోల్స్​
Rajasthan Exit Polls 2023
టైమ్స్​నౌ-ఈటీజీ ​ ఎగ్జిట్​ పోల్స్​
Rajasthan Exit Polls 2023
పీ-మార్క్​ ఎగ్జిట్​ పోల్స్​

Dainik Bhaskar Exit Polls

  • భాజపా 98-105
  • కాంగ్రెస్‌ 85-95
  • ఇతరులు 10-15

ఛత్తీస్​గఢ్​లో మళ్లీ కాంగ్రెస్​కే అధికారం!
Chhattisgarh Election Exit Poll Results 2023 : కాంగ్రెస్​ పార్టీ ఛత్తీస్​గఢ్​లో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి.

ఎగ్జిట్​ పోల్స్​ సంస్థ అంచనాలు ఇలా..

  • ఏబీపీ న్యూస్‌ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. భాజపాకు 36 నుంచి 48 స్థానాలు రావొచ్చని, ఇతరులు 4 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది.
  • జన్‌కీబాత్‌ అంచనా ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ 42 నుంచి 53 స్థానాలు గెలుస్తుంది. బీజేపీ 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశముంది.
సంస్థఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌యాక్సిస్‌ మైఇండియాటీవీ5 న్యూస్పీపుల్స్‌ పల్స్‌
పార్టీ / సీట్లు
కాంగ్రెస్‌46-5640-5054-6654-64
బీజేపీ 30-4036-4629-3929-39
ఇతరులు3-51-50-20-2

తెలంగాణలో బీఆర్​ఎస్​కు గట్టి ఎదురుదెబ్బ!
Telangana Election Exit Poll Results 2023 : తెలంగాణలో కేసీఆర్​ నేతృత్వంలోని బీఆర్​ఎస్​ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని పేర్కొన్నాయి. ఓల్డ్ సిటీలో AIMIM హవా చూపిస్తుందని, భాజపా మాత్రం పూర్తిగా చతికిల పడిందని తెలిపాయి.

Telangana exit polls 2023
సీఓటర్​ ఎగ్జిట్ పోల్స్​
Telangana exit polls 2023
ఇండియా టీవీ ఎగ్జిట్​ పోల్స్​
Telangana exit polls 2023
రేస్​ ఎగ్జిట్ ​పోల్స్

CNN IBN Exit Polls 2023 : సీఎన్​ఎన్​ ఐబీఎన్​ ఎగ్జిట్​ పోల్స్.. బీఆర్‌ఎస్‌ 35 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 65 నుంచి 70 సీట్ల వరకు, బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. ఎంఐఎం 6 నుంచి 7, ఇతరులు 1 లేదా 2 స్థానాలు గెలవవచ్చని పేర్కొంది.

AARAA Exit Polls 2023 : ఆరా మస్తాన్‌ ప్రీ పోల్‌ సర్వే.. అధికార బీఆర్​ఎస్​ 41 నుంచి 49కి మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 58 నుంచి 67 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది. ఇక బీజేపీ 5 నుంచి 7, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావొచ్చని తెలిపింది. పార్టీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్​ఎస్​కు 39.58 శాతం, కాంగ్రెస్​కు 41.13 శాతం, బీజేపీ 10.47, ఇతరులకు 8.82 శాతం లెక్కన ఓట్ల శాతాలు ఉన్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది. కామారెడ్డిలో బీజేపీ గెలిచే అవకాశముందని.. సీఎం కేసీఆర్‌ రెండో స్థానంలో ఉండొచ్చని చెబుతోంది.

Telangana exit polls 2023
ఆరా ఎగ్జిట్​ పోల్స్​

Jan ki Baat Exit Polls 2023 : జన్‌కీబాత్‌ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌ 48 నుంచి 64 చోట్ల గెలుస్తుందని అంచనా వేసింది. అధికార బీఆర్​ఎస్​ 40 నుంచి 55 స్థానాల్లో గెలవొచ్చని చెబుతోంది. అలాగే బీజేపీ 7 నుంచి 13 నియోజకవర్గాలు, మజ్లిస్‌ పార్టీ 4 నుంచి 7 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది.

Chanakya Strategies 2023 : చాణక్య స్ట్రాటజీస్‌.. కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యత సాధించబోతుందని అంచనా వేసింది. 67 నుంచి 78 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ గెలవబోతుందని ఆ సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్​ఎస్​ 22 నుంచి 31 చోట్ల, బీజేపీ 6 నుంచి 9 నియోజకవర్గాల్లో, ఎంఐఎం 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.

Peoples Pulse Exit polls 2023 : పీపుల్స్‌ పల్స్‌, సౌత్‌ ఫస్ట్‌ సర్వేలు.. కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 62 నుంచి 72 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్​ఎస్​కు 35 నుంచి 46 సీట్లు రావొచ్చని.. మజ్లిస్‌ పార్టీ 6 నుంచి 7, బీజేపీ 3 నుంచి 8 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి.

Telangana exit polls 2023
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్​

మిజోరంలో కాంగ్రెస్​, బీజేపీలకు నో ఛాన్స్​!
Mizoram Election Exit Poll Results 2023 : మిజోరంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీలకు అసలు ఛాన్సే లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. స్థానిక పార్టీలైన జోరామ్ పీపుల్స్​ మూవ్​మెంట్​ (ZPM), మిజో నేషనల్​ ఫ్రంట్​ (MNF) మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని పేర్కొన్నాయి.

Mizoram Election Exit Poll
ఇండియా టీవీ- సీఎన్​ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
Mizoram Election Exit Poll
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్​

TV CNX Exit Polls :

పార్టీగెలిచే స్థానాలు
MNF14 -18
ZPM12 - 16
కాంగ్రెస్​8 - 10
బీజేపీ0- 2

ABP NEWS and C Voter Exit Polls :

Mizoram Election Exit Poll
ఏబీపీ న్యూస్​ ఎగ్జిట్​ పోల్స్​
పార్టీగెలిచే స్థానాలు
MNF15 -21
ZPM12 - 18
కాంగ్రెస్​2 - 8
బీజేపీ0 - 0

Jan Ki Baat Exit Polls :

Mizoram Election Exit Poll
జన్​కీబాత్ ఎగ్జిట్ పోల్స్
పార్టీగెలిచే స్థానాలు
MNF10 -14
ZPM15 - 25
కాంగ్రెస్​5 - 9
బీజేపీ0 - 2

సెమీ ఫైనల్స్​!
మధ్యప్రదేశ్, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్​ 3న వెల్లడికానున్నాయి. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్​గా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

సంస్కృతంలోనే మాటామంతీ- తొలి గ్రామంగా రికార్డు- ఎక్కడో తెలుసా?

10 నుంచి 25 వేలకు జన్ ఔషధి కేంద్రాల పెంపు- ఇకపై మరింత చౌకగా మందులు!

Last Updated : Nov 30, 2023, 10:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.