ETV Bharat / bharat

చిన్నారిపై పిన్ని కర్కశం.. చేతులు విరగ్గొట్టి.. ముఖంపై దాడి.. - తెలుగు నేర వార్తలు

Assault on child: ఓ చిన్నారితో కుటుంబ సభ్యులే దారుణంగా ప్రవర్తించారు. శారీరకంగా హింసించారు. చిన్నారి చేతులు విరిగిపోగా... తలకు, ముఖానికి గాయాలు అయ్యాయి. ఓ స్నేహితుడితో కలిసి చిన్నారి పిన్ని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Assault on two and a half-year-old child; police in a hunt for mother's sister and her male friend

author img

By

Published : Feb 23, 2022, 11:33 AM IST

Assault on child: కేరళ ఎర్నాకులం త్రిక్కక్కరాలో రెండున్నరేళ్ల చిన్నారిని తీవ్రంగా హింసించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి పిన్ని, తన స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగానే నిందితులిద్దరూ పారిపోయారని తెలిపారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయని వెల్లడించారు.

Kerala children attacked

నిందితుడిని ఆంటోనీ తిజిన్​గా పోలీసులు గుర్తించారు. 'చిన్నారి పిన్నికి తాను భర్తనని ఆంటోనీ చుట్టుపక్కల వారందరికీ పరిచయం చేసుకున్నాడు. నిజానికి వారిద్దరికీ పెళ్లి కాలేదు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి తల్లి సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. అదే రాత్రి చిన్నారి పిన్ని, ఆంటోనీ తిజిన్ పారిపోయారు' అని పోలీసులు వివరించారు.

చిన్నారిని తీవ్రంగా హింసించారని వైద్య నిపుణులు తేల్చారు. తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. రెండు చేతులు విరిగాయని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని స్పష్టం చేశారు.

చిన్నారి పరిస్థితి తీవ్రం కావడం వల్ల ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయాలపై తల్లి ఇచ్చిన వివరణ అనుమానాస్పదంగా ఉందని గమనించిన వైద్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతకొద్దిరోజుల నుంచి చిన్నారిని హింసిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: తల్లిని చంపిన 14ఏళ్ల బాలిక.. కారణం ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.