ETV Bharat / bharat

అసోం తొలిదశకు సర్వం సిద్ధం- బరిలో ప్రముఖులు

అసోం తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. అధికారం నిలుపుకోవాలని భాజపా, పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్, సత్తా చాటాలని కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్​లు బరిలోకి దిగుతున్నాయి. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. తొలివిడతకు జరుగుతున్న 47 స్థానాల్లో సీఎం సర్బానంద సోనోవాల్​, అసెంబ్లీ స్పీకర్​ హితేంద్రనాథ్ గోస్వామి, అసోం కాంగ్రెస్ చీఫ్​ రిపున్​ బోరా వంటి ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. శనివారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

Assam elections, assam first pahse polls
అసోం తొలిదశ
author img

By

Published : Mar 26, 2021, 4:44 PM IST

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 47 సీట్లకు శనివారం తొలి దశ పోలింగ్ జరగనుంది. భాజపా-ఏజేపీ కూటమి, కాంగ్రెస్ మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్​ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే ప్రధాన పోటీ మాత్రం భాజపా, కాంగ్రెస్​ మధ్యే ఉండనుంది. మొదటి విడత పోలింగ్​లో అసోం సీఎం, భాజపా నేత, సర్బానంద సోనోవాల్, అసెంబ్లీ స్పీకర్​ హితేంద్రనాథ్ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్​ రిపున్​ బోరా వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. ఈ కీలక స్థానాల్లో మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉండటంతో పోటీ రవసత్తరంగా మారనుంది.

Assam elections, assam first pahse polls
అసోం తొలిదశ

తొలి విడతలో మొత్తం 47 స్థానాలకు గానూ 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 81.09 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,537 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 479 కేంద్రాల్లో మొత్తం మహిళా అధికారులే విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో నిబంధనల దృష్ట్యా ఓటర్లకు ఒక గంట అధిక సమయాన్ని కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఏఏ పార్టీలు ఎన్ని చోట్ల..

మొదటి దశకు జరిగే ఎన్నికల్లో భాజపా 39 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షం అసోం గుణ పరిషత్​ 10 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. వీటిలో రెండు స్థానాల్లో ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా తలపడుతున్నాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్​ 43 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. దాని మిత్రపక్షాలు ఏఐయూడీఎఫ్​, సీపీఐ(ఎంల్​-ఎల్​), ఆర్జేడీ, అంచాలిక్ గన మోర్చా(స్వతంత్రంగా) ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

నూతనంగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్​ 41 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. 78 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. కొత్తగా స్థాపించిన రాయ్​జోర్ దళ్​ అభ్యర్థులు 19మంది ఉన్నారు.

కీలక నేతలు..

సీఎం సర్బానంద సోనోవాల్​ మజులి(ఎస్టీ) నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజీబ్​ లోచన్​ ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

మంత్రులు రంజన్‌దత్తా బెహలీ, నబకుమార్‌డోలే జొనాయ్​ నుంచి, సంజయ్‌కిషన్‌ తిన్‌సుకియ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఎన్డీయే కూటమిలోని అసోం గణపరిషత్‌కు చెందిన మంత్రులు అతుల్‌బోరా, కేశవ్‌మహంతాలు బొరాఖాట్‌, కాలియాబోర్‌నుంచి పోటీ చేస్తున్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్‌ తరఫున కూడా పలువురు ముఖ్య నేతలు తొలిదశ బరిలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రిపున్‌బోరా గోపూర్‌నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2016లో ఆయన సతీమణి మోనికాబోరా ఇక్కడ ఓడిపోయారు. భాజపా సిట్టింగ్‌ఎమ్మెల్యే ఉత్పల్‌బోరాతో రిపున్‌బోరా తలపడుతున్నారు. సీఎల్పీ నేత దేవబ్రత సైకియా.. నజిరా నుంచి పోటీలో ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి భూపెన్‌బోరా.. బిపూరియా, మాజీ మంత్రులు భరత్‌నారా.. నౌబొయిచా, ప్రణతి.. నహర్‌కతియా, రకిబుల్‌హుస్సేన్‌.. సమగురి నుంచి బరిలో నిలిచారు. అసోం మాజీ సీఎం తరుణ్‌గొగొయ్‌ప్రాతినిథ్యం వహించిన తితబర్‌స్థానం నుంచి జ్యోతిబరువా పోటీ చేస్తున్నారు. భాజపా నేత హేమంత కలిత ఆయనను ఢీకొంటున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ అసోం జాతీయ పరిషత్‌అధ్యక్షుడు లురిన్ ‌జ్యోతి గొగొయి‌.. దులియాజాన్‌, నహర్‌కతియా రెండుస్థానాల నుంచి రంగంలో ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజర్ దళ్‌అధ్యక్షుడు అఖిల్‌ గొగొయి‌.. శివసాగర్‌నుంచి పోటీలో ఉన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కోటీశ్వరులు

నేర చరితులు

పటిష్ఠ భద్రత..

ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్​ కేంద్రాల్లో మోహరించేందుకు సరిపడా బలగాలు ఉన్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.