అసోంలో 39 స్థానాలకు జరగనున్న రెండో దశ ఎన్నికల్లో 377 మంది బరిలోకి దిగనున్నారు. ఈ ఎన్నికలకోసం 408 మంది నామినేషన్ దాఖలు చేయగా.. అందులో 28మంది దరఖాస్తులను తిరస్కరించినట్లు అసోం ఎన్నికల ప్రధాన అధికారి రాహుల్ దాస్ తెలిపారు.
40 స్థానాల్లో జరగనున్న మూడో దశ ఎన్నికల కోసం ఇప్పటివరకు 38మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రముఖులు వీరే..
రెండో దశ ఎన్నికల్లో భాజపా మంత్రులు పరిమళ్ శుక్లాబైధ్య, భబేష్ కలితా, పిజూష్ హజారికా, డిప్యూటీ స్పీకర్ అనినుల్ హేక్ లస్కర్.. తదితర ప్రముఖ నేతలు పోటీ చేయనున్నారు.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి : ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం