ETV Bharat / bharat

అలా పెళ్లి చేసుకున్నందుకు 1800 మంది అరెస్ట్​.. మరో 2200 మందిపై ప్రభుత్వం గురి!

వివాహ వయసు రాని అమ్మాయిలను పెళ్లి చేసుకున్న 1,800 మందిని అసోం పోలీసులు అరెస్ట్​ చేశారు. బాల్య వివాహాలకు సంబంధించి ఇప్పటికే 4,004 కేసులు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం ఉదయమే ఈ అరెస్టుల పర్వం ప్రారంభించారు.

Etv Bharatassam-police-arrests-thousands-of-people-people-in-massive-crackdown-on-child-marriage
బాల్య వివాహాల చేసుకున్నందుకు వేల మంది అరెస్ట్ చేసిన అసోం పోలీసులు
author img

By

Published : Feb 3, 2023, 1:46 PM IST

Updated : Feb 3, 2023, 4:52 PM IST

బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాల్య వివాహాలు చేసుకున్న వారే లక్ష్యంగా పోలీసులు శుక్రవారం భారీ ఆపరేషన్​ చేపట్టారు. బాల్య వివాహాలకు పాల్పడిన 1,800 మందిని అరెస్ట్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతావారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. అత్యధికంగా ధుబ్రిలో 370 , బార్​పేటలో 110, నాగోన్​లో 100 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
'బాల్య వివాహాలు చేసుకున్నవారిపై ఉక్కుపాదం మోపుతాం. రాష్ట్రంలో 4,004 బాల్య వివాహాల కేసుల నమోదయ్యాయి. అందులో శుక్రవారం 1,800 మందిని అరెస్ట్ చేశాం. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో మిగతా వారిని పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ చేపడతారు.' అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

2023 జనవరి 23న అసోం క్యాబినెట్‌.. బాల్య వివాహాల నిర్మూలన కోసం కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం రెండు వారాల వ్యవధిలోనే కార్యాచరణ ప్రారంభించింది. 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలికలను వివాహం చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 14 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న మైనర్​లను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 31 శాతం వివాహాలు తక్కువ వయసులోనే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది.

Last Updated : Feb 3, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.