Assam gang rape luring loan: అసోంలో దారుణం జరిగింది. మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణానికి పాల్పడుతూ.. వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటన ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు సైతం ఉన్నాడని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి వాటిని ఆ మహిళను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకున్నాడని వెల్లడించారు. ఇద్దరినీ అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.
లోన్లు ఇస్తామని చాలా మంది మహిళలను వీరిద్దరూ ఇలా బలవంతం చేశారని అధికారులు తెలిపారు. డోక్మోకాకు చెందిన ఓ మహిళ సైతం ఇలాగే వారి వలలో పడిపోయిందని చెప్పారు. ఫిబ్రవరిలో ఆమెను కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని ఖేత్రి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ వీడియోను చిత్రీకరించిన నిందితులు.. ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారు. వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె మహిళా హక్కుల సంఘాలను ఆశ్రయించింది. మహిళా సంఘాలు ఫిర్యాదు చేయగా.. స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
UP School teacher raped: మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహన్పుర్లో ప్రభుత్వ స్కూల్ టీచర్‌పై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనను వీడియో తీశాడు. దీన్ని ఉపయోగించుకొని మహిళను మతం మార్చుకొని.. తనను వివాహం చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. బాధిత మహిళ(28) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆమిర్‌ను శనివారం అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు.
మే 4న మహిళ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వచ్చాడు. ఇంటి వద్ద దింపేస్తానని చెప్పి మహిళను బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే మహిళకు మత్తుమందు ఇచ్చి స్పృహ తప్పేలా చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమిర్ కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. మతం మార్చుకొని ఆమిర్‌ను వివాహం చేసుకోవాలని తనను కోరుతున్నారని పేర్కొంది.
యూపీలో మరో ఘటన...: ఐదేళ్లు కూడా నిండని అక్కాచెల్లెల్లపై 25ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. హరియాణాలోని బాద్షాపుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు ఆదిల్.. యూపీలోని బిజ్నోర్కు చెందినవాడని పోలీసులు తెలిపారు. కూలీపని చేసుకుంటూ బతికే అతడు.. బాలికలపై అత్యాచారం చేస్తుండగా స్థానికులు, బాలికల తల్లి గమనించారని చెప్పారు. అనంతరం చితకబాది పోలీసులకు ఫోన్ చేశారని తెలిపారు.
Kerala Teacher molestation: కేరళలో సీపీఎం కౌన్సిలర్ శశి కుమార్‌పై లైంగిక ఆరోపణల కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో టీచర్‌గా పనిచేసిన అతడు.. 30 ఏళ్ల పాటు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నామని.. అనంతరం చాలా మంది బాలికలు ఈ విషయంపై కంప్లైంట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. కాగా, అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది.
Mumbai Dharavi rape: ముంబయిలోని ధారావీలో ఘోరం జరిగింది. పెళ్లైన 19ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడ్డారు. కత్తితో బెదిరించి మహిళపై ఆత్మహత్య చేశారని ధారావీ పోలీసులు వెల్లడించారు. నిందితులు తమ ముఖాలను కనబడకుండా కప్పేసుకున్నారని తెలిపారు. ఘటనను నిందితులు వీడియో తీశారని చెప్పారు. వీరు స్థానికులే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి:
'పిల్ల దొరికినా పెళ్లి చేయట్లేదు'.. తల్లిదండ్రులపై యువకుడి ఫిర్యాదు